బ్యాడ్ న్యూస్: హెర్నియా సర్జరీ వల్ల ఐపీఎల్ 2024కు స్టార్ బ్యాటర్ దూరం
IPL 2024: మచ్ అవైటెడ్ మెగా ఈవెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17వ ఎడిషన్ సమీపిస్తోంది. ఈ బిగ్గెస్ట్ టోర్నమెంట్ ఆరంభం కావడానికి ఎంతో సమయం లేదు. ఫిబ్రవరి/మార్చి నెలల్లో ఐపీఎల్ 2024 సీజన్ మొదలవుతుంది. మొత్తం 10 జట్లు పోరాడనున్నాయి.
రెండున్నర నెలల పాటు అంటే 74 రోజుల పాటు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించే బిగ్గెస్ట్ టోర్నమెంట్ ఇది. దీని కోసం ఇప్పటి నుంచే సన్నాహకాలు సాగుతున్నాయి. అన్ని ఫ్రాంఛైజీలు తమ జట్లను సరికొత్తగా రూపుదిద్దుతున్నాయి. గెలుపు గుర్రాలను జట్టులోకి తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తోన్నాయి.

ఇప్పటికే మెగా ఆక్షన్ ముగిసింది కూడా. ఈ వేలం పాట తరువాత అన్ని ఫ్రాంఛైజీల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. చాలామంది ప్లేయర్లు అటు ఇటు అయ్యారు. కొత్త ఫ్రాంఛైజీల తరఫున ఆడబోతోన్నారు. రోహిత్ శర్మకు బదులుగా ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యా నాయకత్వాన్ని వహించనున్నాడు.
ఈ పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్‌కు బ్యాడ్ న్యూస్. స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఈ సీజన్‌కు దూరం కానున్నాడు. సీజన్ మొత్తానికి కాకపోయినా తొలి సగం మ్యాచ్‌లకు అతను అందుబాటులో ఉండట్లేదు. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది.
సూర్యకుమార్ యాదవ్.. హెర్నియా సర్జరీ చేయించుకోనుండటమే దీనికి కారణం. సర్జరీ తరువాత కనీసం 8 నుంచి 9 వారాలపాటు విశ్రాంతి అవసరమౌతుందని అంచనా వేస్తోన్నారు. ఈ లోగా ఐపీఎల్ 2024 సీజన్ సగం వరకు ముగిసిపోవచ్చు. హెర్నియా సర్జరీ నుంచి పూర్తిగా కోలుకుంటేనే అతను ఐపీఎల్‌కు అందుబాటులోకి వస్తాడు.
ఈ ఉద్దేశంతోనే సూర్యను ఆఫ్ఘనిస్తాన్ పర్యటనకు కూడా ఎంపిక చేయలేదు సెలెక్టర్లు. అతనికి విశ్రాంతి ఇచ్చారు. తిలక్ వర్మ, రింకూ సింగ్, శివం దుబే, సంజు శాంసన్, జితేష్ శర్మకు జట్టులో చోటు కల్పించారు. హెర్నియా సర్జరీ కోసం సూర్యను బీసీసీఐ విదేశాలకు పంపించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications