ఏడు బంతులతో.. ఓవర్‌నైట్ స్టార్: టీమిండియా మాజీకి డెడికేట్
Ashutosh Sharma: ఐపీఎల్ 2025 సీజన్ 18వ ఎడిషన్‌లో ఎట్టకేలకు ఓ థ్రిల్లర్ చూసే అవకాశం లభించింది తెలుగు నేలపై. ఢిల్లీ కేపిటల్స్‌పై గెలిచి తీరుతుందనుకున్న లక్నో సూపర్ జెయింట్స్.. మట్టికరిచింది. గెలుపు అంచుల్లో నిలిచిన ఆ జట్టు పరాజయాన్ని చవి చూడాల్సొచ్చింది.. ఒకే ఒక్కడి వల్ల.
సోమవారం రాత్రి విశాఖపట్నంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ కేపిటల్స్.. ఇంకా మూడు బంతులు మిగిలివుండగానే ఈ స్కోర్‌ను అధిగమించింది. తొమ్మిది వికెట్ల నష్టానికి 211 పరుగులతో విజయాన్ని అందుకుంది.

ఢిల్లీ ఇన్నింగ్‌లో అసలు హీరో అశుతోష్ శర్మ. 12.3 ఓవర్లల్లో 113 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి, ఓటమి తప్పదనుకున్న దశలో క్రీజ్‌లోకి దిగిన అశుతోష్ వీరవిహారం చేశాడు. గెలవాలంటే- 45 బంతుల్లో 97 పరుగులు అవసరం. అలాంటి పరిస్థితుల్లో భారీ షాట్లతో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 31 బంతుల్లో 66 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
రవి బిష్ణోయ్ వేసిన 18వ ఓవర్ చివరి మూడు బంతుల్లో 12 పరుగులు కొట్టాడు. ఆ తరువాతి ఓవర్‌లోనూ అతని దూకుడు కొనసాగింది. అతని ప్రతాపానికి ప్రిన్స్ యాదవ్ బలి అయ్యాడు. ఆ ఓవర్ చివరి మూడు బంతుల్లో 12 పరుగులు రాబట్టడంతో ఈక్వేషన్లు మొత్తం మారిపోయాయి. అంతరం ఆరు బంతులకు ఆరు పరుగులుగా తేలింది.
చివరి ఓవర్ తొలి రెండు బంతులను మోహిత్ శర్మ ఎదుర్కొన్నాడు. షాబాజ్ అహ్మద్ వేసిన ఓవర్ అది. రెండో బంతికి సింగిల్ తీశాడు. మూడో బంతిని అశుతోష్ శర్మ సిక్సర్‌గా మలిచాడు. జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. అతను ఎదుర్కొన్న చివరి ఏడు బంతుల్లో 34 పరుగులు వచ్చాయంటే అతని బ్యాటింగ్ ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. 6,4,6,2,6,4,6.. పరుగులు రాబట్టుకున్నాడు.
విన్నింగ్ షాట్ కొట్టిన తరువాత- టీమ్ బ్యాటింగ్ కన్సల్టెంట్ కెవిన్ పీటర్సన్‌కు థ్యాంక్స్ చెప్పాడు. పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్ సందర్భంగా అతను మాట్లాడాడు. కెవిన్ ఇచ్చిన టిప్స్ తన బ్యాటింగ్ స్టైల్‌ను మెరుగుపర్చుకోవడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయని, దాని ఫలితంగానే ఈ ఇన్నింగ్ ఆడగలిగానని అన్నాడు.
ఈ మెరుపు ఇన్నింగ్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ టైటిల్‌ను టీమిండియా మాజీ క్రికెటర్‌కు శిఖర్ ధావన్‌కు అంకితం చేశాడు అశుతోష్ రాణా. శిఖర్‌ను తన మెంటార్‌గా అభివర్ణించాడు. అతనిచ్చిన స్ఫూర్తితోనే.. ఒత్తిడిని జయించగలిగానని చెప్పాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు స్వేచ్ఛగా ఆడాలని, ఒత్తిడికి దూరంగా ఉండాలనే విషయాన్ని శిఖర్ నుంచే నేర్చుకున్నానని అన్నాడు.
గత సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లను అసంపూర్తిగా వదిలివేశానని గుర్తు చేసుకున్నాడు. ఈ సీజన్‌లో ఆ లోటును తీర్చుకుంటానని, అత్యుత్తమ ఫినిషర్‌గా గుర్తింపు పొందాలని కోరుకుంటోన్నట్లు అశుతోష్ శర్మ వివరించాడు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications