IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్లో పంజాబ్ టాస్-ఆర్సీబీ బ్యాటింగ్..ప్లేయర్లు వీరే..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ ఫైనల్ (IPL 2025 Final) మొదలైంది. టోర్నీలో వరుస విజయాలతో ఫైనల్ కు చేరుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( RCB)తో పంజాబ్ కింగ్స్ (PBKS) అమీతుమీకి సిద్ధమైంది. ఫైనల్ మ్యాచ్ లో భాగంగా టాస్ నెగ్గిన పంజాబ్ కింగ్స్ సారధి శ్రేయస్ అయ్యర్ మరో మాట లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గత మ్యాచ్ లో ముంబైపై భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఆత్మవిశ్వాసంతో శ్రేయస్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో ఆర్సీబీ బ్యాటింగ్ చేస్తోంది.
అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో పిచ్ ఛేజింగ్ కు అనుకూలిస్తుందన్న అంచనాల మధ్య టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ గత మ్యాచ్ ఆడిన జట్టునే కొనసాగించగా.. ఆర్సీబీ మాత్రం టిమ్ డేవిడ్ ను తప్పించి లివింగ్ స్టోన్ ను తీసుకుంది. మ్యాచ్ ఆరంభానికి ముందు నుంచే మైదానంపై మేఘాలు కనిపిస్తున్నా వర్షం పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

ఇక ఇరుజట్లలో పైనల్ ఆటగాళ్లను పరిశీలిస్తే ఆర్సీబీలో ఫిల్ సాల్ట్, విరాట్ కొహ్లీ, మయాంక్ అగర్వాల్, రజత్ పటీదార్, లివింగ్ స్టోన్, జితేష్ శర్మ, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాళ్, జోష్ హేజిల్ వుడ్ ఆడుతున్నారు. అలాగే ఆర్సీబీ ఇంపాక్ట్ బెంచ్ లో సుయాష్ శర్మ, రసిఖ్ దార్, మనోజ్ భంగడే, టిమ్ సీఫెర్ట్, స్వప్నిల్ సింగ్ ఉన్నారు.
పంజాబ్ కింగ్స్ తది జట్టులో ప్రియాన్ష్ ఆర్య, శ్రేయస్ అయ్యర్, జోష్ ఇంగ్లిస్, నీహల్ వథేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, విజయ్ కుమార్ వైశాఖ్, అజ్మతుల్లా ఒమర్ జాయ్, కైల్ జేమీసన్, అర్ష్ దీప్ సింగ్, యజ్వేంద్ర చాహల్ ఉన్నారు. అలాగే పంజాబ్ ఇంపాక్ట్ బెంచ్ లో ప్రభ్ సిమ్రన్ సింగ్, జేవియర్ బార్లెట్, హర్ ప్రీత్ బ్రార్, సూర్యాన్ష్ షెగ్డే, ప్రవీణ్ దూబే ఉన్నారు.












Click it and Unblock the Notifications