IPL Mega Auctin 2025: అర్ష్‌దీప్‌పై ప్రీతి జింటా మోజు..తగ్గేదేలే..!!

ఐపీఎల్ మెగా ఆక్షన్ ప్రారంభమైంది. జెడ్డా వేదికగా సాగుతున్న ఈ వేలంపాటలో ఫ్రాంఛైజీలంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమానికి ఆక్షనీర్‌గా మల్లికాసాగర్ వ్యవహరించారు. ఇక ముందుగా మార్కీ ప్లేయర్లను ముందుగా వేలం నిర్వహించారు. మెగా ఆక్షన్‌లో వేలంకు వచ్చిన తొలి ఆటగాడు అర్షదీప్‌సింగ్.

అర్షదీప్ సింగ్‌ బేస్ ధర రూ.2 కోట్లు ఉండగా వేలం ప్రారంభం కాగానే బెంగళూరు ఈ ఆటగాడిని సొంతం చేసుకునే ప్రయత్నం ప్రారంభించింది. బెంగళూరుకు ధీటుగా ఢిల్లీ క్యాపిటల్స్ రంగంలోకి దిగి బెంగళూరు కంటే ఎక్కువగా పాడింది. ఒక నొక సందర్భంలో బెంగళూరు తప్పుకోగా రేసులోకి గుజరాత్ టైటాన్స్ వచ్చింది. ఇక అర్షదీప్ సింగ్ కోసం గుజరాత్ ఢిల్లీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. గుజరాత్ టైటాన్స్ తగ్గకపోవడంతో ఢిల్లీ పక్కకు తప్పుకుంది.

IPL 2025 Punjab kings owns Arshdeep singh in the last minute for Rs 18cr using RTM

ఇక అర్షదీప్ సింగ్‌ను గుజరాత్ సొంతం చేసుకుంటుందనగా... హైదరాబాద్‌ ఓనర్ కావ్యాపాప చివరి నిమిషంలో రంగంలోకి దిగింది. ఇక్కడి నుంచి పోటీ తీవ్రంగా మారింది. గుజరాత్ హైదరాబాద్ మధ్య అర్షదీప్ సింగ్ కోసం పోటీ జరుగగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.18 కోట్లు కుమ్మరించింది. ఇక ఆక్షనీర్ మల్లికా సాగర్ అర్షదీప్ సింగ్‌ను హైదరాబాద్‌‌కు చేరాడని ప్రకటించారు. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది.

రూ.18. కోట్లు అనగానే రేస్ నుంచి గుజరాత్ టైటాన్స్ తప్పుకుంది. ఇక అర్షదీప్ సింగ్ హైదరాబాదుకే అనుకున్న సమయంలో పంజాబ్ తన రైట్‌ టూ మ్యాచ్ కార్డును వినియోగించుకుంది. వాస్తవానికి అర్షదీప్ సింగ్‌ను పంజాబ్ బిడ్డింగ్‌కు వదిలింది. అయితే తమ ఆటగాడు తమవద్దే ఉండాలని భావించిన ప్రీతిజింటా రైట్ టూ కార్డు ద్వారా అర్షదీప్‌సింగ్‌ను రూ.18 కోట్లకు సొంతం చేసుకుంది. కావ్యా పాపకు నిరాశే ఎదురైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+