ఆ సెంటిమెంట్ రిపీటైతే IPL 2026 ఛాంపియన్‌గా RCB..? ఇదీ లెక్క..!!

IPL 2026 కీలక దశకు వచ్చేసింది. లీగ్ మ్యాచ్ లు ముగుస్తున్నాయి. ప్లే ఆఫ్స్ రేసు పైనా దాదాపు క్లారిటీ వచ్చింది. మూడు టీంలు ఇప్పటికే ఖరారయ్యాయి. నాలుగో టీం ఈ రోజు ఫైనల్ కానుంది. ఈ సమయంలో ప్లే ఆఫ్స్ లో ఎవరితో ఎవరు ఆడుతారనేది ఈ రోజు తేలిపోతుంది. కాగా.. ఈ సారి ఐపీఎల్ లో చాంపియన్ పైన కొత్త లెక్కలు మొదలయ్యాయి. గత సీజన్ల సెంటిమెంట్ మరోసారి ప్రస్తావన కు వస్తోంది. సెంటిమెంట్ రిటీప్ అయితే.. ఆర్సీబీకీ కలిసి వస్తుంది. మరి.. సాధ్యమేనా అనేది ఇప్పుడు చర్చగా మారుతోంది.

ప్రస్తుత సీజన్ లో ప్లే ఆఫ్స్ మ్యాచులు ప్రారంభం అవుతున్నాయి. పాయింట్ల పట్టికలో ఆర్సీబీ అగ్ర స్థానంలో ఉంది. ఐపీఎల్ చరిత్రలో లీగ్ దశ పూర్తయ్యే సమయంలో పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచిన జట్టు.. ఛాంపియన్‌గా నిలవటం మూడు సార్లు చోటు చేసుకుంది. ఇదే అంశం ప్రస్తుత సీజన్ లో సెంటిమెంట్ గా భావిస్తున్నారు. 2020 ఐపీఎల్ లో ముంబాయి ఇండియన్స్ పాయింట్ల పట్టికలో చివరి వరకు టాప్ లో నిలిచింది. చివరకు ఆ సీజన్ చాంపియన్ గా ట్రోఫీని సొంతం చేసు కుంది. ఇదే సెంటిమెంట్ తరువాతి సీజన్లలోనూ కొనసాగింది. 2020, 2022 రెండేళ్లలో సీజన్లలో లీగ్ పట్టికలో నంబర్ వన్ స్థానంలో నిలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టే ఫైనల్ మ్యాచ్‌లో జయభేరి మోగించి ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఇక.. 2024 లోనూ ఇదే సెంటిమెంట్ రిపీట్ అయింది. ఆ సీజన్ లో కేకేఆర్ అగ్రస్థానంలో కొనసాగింది. చివరకు ఆ సీజన్ ఛాంపియన్ గా ఆవిర్భవించింది.

 ఒకే రైలులో తిరుపతి, అరుణాచలం, శ్రీరంగం - రూట్, షెడ్యూల్..!!
ఒకే రైలులో తిరుపతి, అరుణాచలం, శ్రీరంగం - రూట్, షెడ్యూల్..!!
ipl-2026-can-the-table-toppers-turn-dominance-into-championship-glory-again-here-the-details

సెంటిమెంట్ రిపీట్ అయితే..

అయితే, ఇప్పుడు ప్రస్తుత సీజన్ లో లీగ్ ప్రారంభం నుంచి అత్యంత స్థిరమైన, దూకుడుతో కూడిన ఆటను ప్రదర్శించిన ఆర్సీబీ జట్టు అధికారికంగా పాయింట్ల పట్టికలో టాపర్‌గా నిలిచింది. దీంతో.. 2020, 2022, 2024 సీజన్లలో చోటు చేసుకున్న సెంటిమెంట్ ఈసారి కూడా లీగ్ టాపరే ఛాంపియన్‌గా నిలుస్తారా అనేది చర్చగా మారింది. మరోసారి 'ఈసాలా కప్ నమదే' అనే నినాదం మరోసారి నిజం కాబోతోందని, ఆర్సీబీ తన రెండవ ఐపీఎల్ ట్రోఫీని అందుకోవడం ఖాయమని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. బెంగళూరు ఆడుతున్న తీరు, జట్టులోని ఆటగాళ్ల ఫామ్ చూస్తుంటే ఈ విచిత్రమైన సెంటిమెంట్ నిజం అవుతుందని ఆర్సీబీ ఫ్యాన్స్ భారీ అంచానాలతో ఉన్నారు. ప్లే ఆఫ్స్ కు చేరిన మిగిలిన జట్ల ప్రదర్శన ధీటుగా ఉండటంతో.. ఈ సారి ఛాంపియన్ గా ఎవరు గెలుస్తారనేది ఆసక్తిని పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+