ఐపీఎల్ లో అనూహ్య మార్పులు- చెన్నై సూపర్ కింగ్స్ కు సెగ?

ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ రసవత్తరంగా సాగుతోంది. సెమీఫైనల్స్ బెర్త్ కోసం ఎనిమిది జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇంగ్లాండ్ తన బెర్త్ ను కన్ఫర్మ్ చేసుకోగా.. మిగిలిన మూడు స్థానాల కోసం ఏడు జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నాయి. దీనికి భారత్ కూడా మినహాయింపు కాదు. ఈ పరిణామాల మధ్య ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 షెడ్యూల్‌ విడుదల అయింది. వరల్డ్ కప్ ముగిసీ ముగియంగానే ఐపీఎల్ సందడి ఆరంభం కాబోతోంది.

ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ఆసక్తికరమైన, ధనిక ఫ్రాంచైజీ లీగ్‌లలో ఒకటిగా పేరు పొందిన ఈ టోర్నమెంట్.. మార్చి 28వ తేదీన ప్రారంభం కాబోతోంది. మే 31వ తేదీన జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఇందులో స్వల్పంగా మార్పులు చోటు చేసుకున్నాయి. నిజానికి, బీసీసీఐ మొదట మార్చి 26న లీగ్ ప్రారంభించాలని భావించినా, ఇప్పుడు రెండు రోజుల ఆలస్యంగా మొదలు కాబోతోంది. ఈ విషయం ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో వెల్లడించింది. దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

IPL 2026 is set to begin on the 28th of March and is scheduled to have the final on May 31 Reports

ఈ ఏడాది అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. కోల్‌కతా నైట్ రైడర్స్- పశ్చిమ బెంగాల్, చెన్నై సూపర్ కింగ్స్- తమిళనాడుతో పాటు అస్సాంలోని గువాహటిని రెండో హోమ్ గ్రౌండ్ గా మలచుకున్న రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లు ఈ ఎన్నికల ప్రభావితం కానున్నాయి. ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించకపోవడం ఐపీఎల్ లో తాజాగా తలెత్తిన ఈ జాప్యానికి ప్రధాన కారణం.

ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వచ్చే వారం సమావేశం కానుంది. వాయిదా పడిన మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్, వేదికలపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఎన్నికల కారణంగా కొన్ని ఫ్రాంచైజీల మ్యాచ్‌లు ప్రభావితమవుతాయి. ఐపీఎల్ 2008లో ప్రారంభమైనప్పటి నుండి దేశంలో సార్వత్రిక ఎన్నికలు (2009, 2014, 2019, 2024), కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సందర్భాల్లో షెడ్యూల్‌ను సాధారణంగా రెండు భాగాలుగా ప్రకటించారు. ఇది లీగ్‌కు ఒక సాధారణ పద్ధతి.

మొత్తం నాలుగు సార్లు ఐపీఎల్ విదేశాల్లో జరిగింది. 2009లో సార్వత్రిక ఎన్నికల కారణంగా టోర్నమెంట్‌ను పూర్తిగా దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. 2014లో, ఎన్నికల నేపథ్యంలో మొదటి భాగాన్ని యూఏఈలో ఆడగా, మిగిలిన దశ భారతదేశంలో జరిగింది. 2020లో కోవిడ్-19 మహమ్మారి కారణంగా, అలాగే 2021 సీజన్ సగం వరకు కూడా విదేశాల్లోనే మ్యాచ్‌లు జరిగాయి.

ఈసారి కూడా అదే వ్యూహాన్ని అమలు చేయాలా లేదా కేంద్ర ఎన్నికల కమిషన్ ఆ మూడు రాష్ట్రాల ఎన్నికల తేదీలను ప్రకటించే వరకు వేచి చూడాలా అనేది ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయించనుంది. టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ ఎక్కడ జరుగుతుందనే దానిపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ప్రస్తుత ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది. వారితో తలపడే ప్రత్యర్థి జట్టును ఇంకా ఖరారు చేయలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+