IPL 2026: డేంజర్ జోన్ లో ఆ రెండు జట్లు, ప్లే ఆఫ్స్ చేరాలంటే - ఈ టీంలకే ఛాన్స్..!!

IPL 2026: ప్లే ఆఫ్స్ కు చేరెదెవరు. ఇప్పటి వరకు ఆర్సీబీ బెర్తు ఖాయమైంది. మిగిలిన మూడు స్థానాల్లో నిలచెదేవరో ఇంకా పూర్తి స్పష్టత రావటం లేదు. లీగ్ చివరి దశకు చేరుతున్న వేళ లెక్క లు వేగంగా మారిపోతున్నాయి. పంజాబ్.. సన్ రైజర్స్.. గుజరాత్ ఖాయమని భావిస్తున్న వేళ తాజా మ్యాచుల ఫలితాలు అంచనాలను తల కిందులు చేస్తున్నాయి. దీంతో.. ప్లే ఆఫ్స్ చేరే మిగిలిన జట్ల లెక్కలు ఆసక్తి కరంగా మారాయి. పాయింట్ల పట్టిక లో ఇప్పుడు రన్ రేటు డిసైడర్ గా మారుతోంది.

ఐపీఎల్ లీగ్ ముగింపు దశకు చేరింది. ప్లే ఆప్స్ రేసులో ప్రస్తుతం ఏడు జట్లు పోటీ పడుతున్నాయి. తాజాగా రాజస్థాన్ రాయల్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ సాధించిన విజయం పాయింట్ల పట్టికలో సమీకర ణాలను ఒక్కసారిగా మార్చేసింది. ఇప్పటి వరకు అధికారికంగా ఆర్సీబీ మాత్రమే ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అయింది. మిగిలిన మూడు స్థానాల కోసం ఏడు జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. రెండో స్థానంలో గుజరాత్ కు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కేకేఆర్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ, గుజరాత్ 99.2 శాతం క్వాలిఫికేషన్ ప్రాబబిలిటీతో రెండో స్థానంలో ఉంది. ఇక ఆరెంజ్ ఆర్మీ సన్‌రైజర్స్ హైదరాబాద్ 75 శాతం అవకాశాలతో మూడో స్థానంలో పటిష్టంగా కనిపిస్తోంది. ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని ఈ జట్టు తన తర్వాతి మ్యాచుల్లో విజయం సాధిస్తే ఇక ఎటువంటి అడ్డంకి లేకుండా ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది. ఒక మ్యాచ్ లో ఓడినా మళ్లీ రన్ రేటుతో సహా ఇతర టీంల గెలుపు.. వారి పాయింట్లు కీలకంగా మారుతాయి.

ఇక్కడా విజయ్ పార్టీ విస్తరణ, టార్గెట్ ఫిక్స్ - రంగంలోకి స్ట్రాటజిస్టులు..!!
ఇక్కడా విజయ్ పార్టీ విస్తరణ, టార్గెట్ ఫిక్స్ - రంగంలోకి స్ట్రాటజిస్టులు..!!
ipl-2026-playoffs-rcb-qualify-gt-depend-on-nrr-srh-almost-through-here-the-scenario

ప్లే ఆఫ్స్ రేసులో చివరకు నిలిచే జట్లు

కాగా, నాలుగో స్థానం కోసం పోటీ ఎక్కువగా ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ కు 35.5 శాతం అవకాశాలు ఉండగా, రాజస్థాన్ రాయల్స్ 34.8 శాతంతో పోటీ పడుతోంది. తాజా మ్యాచ్ లో రాజస్థాన్ జట్టు ఢిల్లీ చేతిలో ఓడిపోవడం వల్ల వారి అవకాశాలు దెబ్బతిన్నాయి. ఇక.. తొలి నుంచి పాయింట్ల పట్టికలో దూసుకు వెళ్లిన శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం టేబుల్‌లో నాలుగో స్థానంలో ఉంది. పంజాబ్ ప్లే ఆఫ్స్ క్వాలిఫికేషన్ ఛాన్స్ మాత్రం 31.1 శాతంగానే కనిపిస్తోంది. కాగా.. అనూహ్యంగా రాజస్థాన్ రాయల్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్కు ప్లేఆఫ్స్ ఆశలు పెరుగుతున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ వరుస వైఫల్యాలతో 13.9 శాతానికి పడిపోయింది. దీంతో.. ఈ రోజు చెన్నై - సన్ రైజర్స్ మ్యాచ్ హోరా హోరీగా సాగే అవకాశం కనిపిస్తోంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ బెర్తు దాదాపు ఖాయం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చెన్నై గెలిస్తే లెక్కలు మరింత సంక్లిష్టంగా మారనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+