MI vs RCB: ముంబైని ముంచిన రోహిత్.. ఆర్‌సీబీ ఘన విజయం
ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్ ఓటమిపాలైంది. ఆదివారం వాంఖడే వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన ముంబై ఇండియన్స్ 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో ఆర్‌సీబీ అసాధారణ ప్రదర్శన కనబర్చింది. ముఖ్యంగా ఆర్‌సీబీ టాప్-3 బ్యాటర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్ విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగా.. బౌలర్లు సుయాశ్ శర్మ, కృనాల్ పాండ్యా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ముంబై పతనాన్ని శాసించారు.
రూథర్ ఫోర్డ్ పోరాడినా..
241 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 222 పరుగులే చేసి ఓటమిపాలైంది. హార్దిక్ పాండ్యా(23 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 40),ర్యాన్ రికెల్టన్(22 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37), సూర్యకుమార్ యాదవ్(22 బంతుల్లో 5 ఫోర్లతో 33), షెర్ఫన్ రూథర్ ఫోర్డ్(31 బంతుల్లో ఫోర్, 9 సిక్స్‌లతో 71 నాటౌట్) పోరాడినా ఫలితం లేకపోయింది. ఆర్‌సీబీ బౌలర్లలో సుయాష్ శర్మ(2/47) రెండు వికెట్లు తీయగా.. కృనాల్ పాండ్యా, జాకోబ్ డఫీ, రసిక్ సలామ్ చెరో వికెట్ పడగొట్టారు.

అంతకు ముందు ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 240 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్(36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 78), విరాట్ కోహ్లీ(38 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 50), రజత్ పటీదార్(20 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 53), టీమ్ డేవిడ్(16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34 నాటౌట్) చెలరేగారు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా, మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీసారు.
కొంపముంచిన రోహిత్ శర్మ గాయం..
241 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్‌కు శుభారంభం దక్కింది. రోహిత్, రికెల్టన్ దూకుడుగా తమ ఇన్నింగ్స్ ప్రారంభించారు. కానీ రోహిత్ శర్మ అనూహ్యంగా తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడ్డాడు. ఫిజియోల ప్రథమ చికిత్స అనంతరం బ్యాటింగ్ కొనసాగించే ప్రయత్నం చేసినా.. తీవ్ర నొప్పి కారణంగా అతని వల్ల కాలేదు. దాంతో రోహిత్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగడంతో 57 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది.
రోహిత్ శర్మ గాయపడకుండా కాసేపు క్రీజులో ఉండి ఉంటే ముంబై ఇండియన్స్ పరిస్థితి మరోలా ఉండేది. ఇదే మైదానంలో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్-రికెల్టన్ అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో ముంబైని గెలిపించారు. మరోసారి అలాంటి ఇన్నింగ్స్ ఆడాలని అంతా ఆశించారు. కానీ రోహిత్ గాయం ముంబై విజయవకాశాలను దెబ్బతీసింది.
ఒకే ఓవర్లో రెండు వికెట్లు..
పవర్ ప్లే అనంతరం సుయాశ్ శర్మ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. డేంజరస్ ర్యాన్ రికెల్టన్‌తో పాటు తిలక్ వర్మ(1)ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత హార్దిక్, సూర్యకుమార్ యాదవ్ మెరుగ్గా ఆడినా.. దూకుడుగా ఆడే ప్రయత్నంలో సూర్య, హార్దిక్ వెనుదిరిగారు. తర్వాత వచ్చిన నమన్ ధీర్(1) కూడా విఫలమవడంతో ముంబై ఓటమి ఖాయమైంది.
మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన..
ఆర్‌సీబీ తరఫున రజత్ పటీదార్ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబర్చాడు. 265 స్ట్రైక్‌రేట్‌తో 20 బంతుల్లోనే 53 పరుగులు చేసి ఆర్‌సీబీకి భారీ స్కోర్‌ను అందించాడు. మయాంక్ మార్కండే బౌలింగ్‌లో అతను బాదిన హ్యాట్రిక్ సిక్స్‌లు గేమ్ ఛేజింగ్ మూమెంట్‌గా నిలిచింది.
-
రోహిత్, శార్దూల్ ఒక్క పైసా కూడా ఇవ్వలేదు: చిన్ననాటి కోచ్ వీడియో -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఆయన వల్లే ఈ సెంచరీ.. నా లక్కీ ఛార్మ్: సంజూ శాంసన్ -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
బీసీసీఐ రూల్స్ బ్రేక్.. రాజస్థాన్ రాయల్స్‌కు చిక్కులు! -
ఎంత సీఎం అయినా.. !! -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
ట్రాక్ ఎక్కేశాడు- కాచుకోండి ఇక -
అరె ఓ సాంబా.. ఇంకో రెండు పాయింట్లు ఇచ్చుకో -
అందరి నోళ్లూ ముయించాడు గానీ.. -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
బుడ్డోడి ఈ అతి దూకుడు మునిగిపోవడానికేనా?












Click it and Unblock the Notifications