Qualifier 1 RCB vs GT లో గెలుపు ఛాన్స్ వారికే, అసలు గండం 'అతనే'- ఇర్ఫాన్..!!
IPL 2026 Qualifier 1: ఐపీఎల్ కీలక దశకు చేరుకుంది. క్వాలిఫైర్ తొలి మ్యాచ్ ఈ రోజు ధర్మశాల లో జరుగుతోంది. గత ఏడాది ఛాంపియన్ ఆర్సీబీ పైన భారీ అంచనాలు ఉన్నాయి. ఇదే సమయంలో ఊహించని విధంగా గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్ లో దూసుకు వచ్చింది. ఇప్పుడు ఈ రెండు జట్ల తొలి క్వాలిఫైర్ మ్యాచ్ లో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ పైన మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తన అంచనాలను వెల్లడించారు. ఎవరికి గెలుపు ఛాన్స్ ఉందో స్పష్టం చేసారు.
ఐపీఎల్ 2026 సీజన్ తుది ఘట్టానికి చేరింది. లీగ్ దశలో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ హోరా హోరీ పోరుకు సిద్దం అయ్యాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం (క్వాలిఫైయర్-2) ఉన్నప్పటికీ, ఎలాగైనా ఇక్కడే విజయం సాధించి ఫైనల్ బెర్తును ఖరారు చేసుకోవాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఈ సీజన్ అంతటా గుజరాత్ టైటాన్స్ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో అద్భుతమైన సమతుల్యతతో కనిపిస్తోంది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సైతం రేసులో ఫుల్ జోష్ తో ముందుకు వెళ్తోంది. విరాట్ కోహ్లీతో పాటు దేవదత్ పడిక్కల్ సూపర్ ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కొండంత బలాన్ని ఇస్తోంది.

రెండు జట్ల మధ్య హోరా హోరీ పోరు
ఆర్సీబీ బౌలింగ్ విభాగంలో సీనియర్ స్పీడ్‌స్టర్ భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ వంటి హేమాహేమీలు ఉండటంతో బెంగళూరు శిబిరం కూడా విజయంపై ధీమాతో ఉంది. కాగా.. కీలక మైన ఈ మ్యాచ్ పైన మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తన అంచనాలను వెల్లడించారు. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్‌కు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని పఠాన్ పేర్కొన్నాడు. గుజరాత్‌కు 55 శాతం గెలిచే అవకాశాలు ఇవ్వగా, బెంగళూరుకు 45 శాతం ఛాన్స్ ఇచ్చారు. ఈ టోర్నమెంట్ లో రెండు జట్లు బలంగా ఉన్నప్పటికీ, గుజరాత్ బౌలింగ్ దళం అత్యంత ప్రమాదకరంగా ఉందని విశ్లేషించారు. ఇక.. ఇక్కడ టాస్ కీలక పాత్ర పోషించనుందని అంచనా వేశాడు. ఒకవేళ గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిస్తే, ముందుగా బౌలింగ్ ఎంచుకుని బెంగళూరును తక్కువ పరుగులకే కట్టడి చేయాలని చూస్తుందని తెలిపాడు. అదే సమయంలో బెంగళూరు టాస్ గెలిస్తే మాత్రం, ధర్మశాల పిచ్‌పై ఛేజింగ్‌కే మొగ్గు చూపే అవకాశం ఉందని పేర్కొన్నాడు. దీంతో.. ఈ మ్యాచ్ లో ఎవరిని విజయం వరిస్తుందనేది ఆసక్తి గా మారుతోంది.













Click it and Unblock the Notifications