Virat Kohli: అయోధ్యలో కనిపించని విరాట్ కోహ్లీ.. ఆహ్వానం అందినా డుమ్మా..!

టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ ఎక్కడున్నాడని సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. నిజానికి విరాట్ కోహ్లీతో పాటు ఆయన భార్య అనుష్క శర్మకు అయోధ్య రామ మందిర ట్రస్ట్ నుంచి ఆహ్వానం అందింది. అందరు విరుష్క దంపతులు అయోధ్య వెళ్తారని భావించారు. కాని విరాట్, అనుష్క అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి వెళ్లలేదు. విరాట్ ఈ వారం ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పాల్గొనేందుకు భారత జట్టులో చేరేందుకు విరాట్ కోహ్లీ హైదరాబాద్‌కు చేరుకున్నాడు.

అయితే అతను వ్యక్తిగత కారణాలతో సిరీస్‌లోని మొదటి రెండు టెస్టు మ్యాచ్‌ల నుంచి బ్యాట్స్‌మెన్ గా వైదొలిగినట్లు బీసీసీఐ ప్రకటించింది. హైదరాబాద్, విశాఖపట్నంలలో జరగాల్సిన మొదటి రెండు టెస్టులను కోహ్లీ ఆడడని, అతని గోప్యతను గౌరవించాలని అభ్యర్థించినట్లు బీసీసీఐ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో కోహ్లీ ఎందుకు అయోధ్యకు వెళ్లలేదని సోషల్ మీడియాలో చర్చలు కొనసాగుతోన్నాయి.

 It seems that Virat Kohli did not go to Ayodhya despite being invited

కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విరుష్క దంపతులు శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠకు వెళ్లలేదని తెలుస్తోంది. కాగా భారత్‌-ఇంగ్లండ్‌ల మధ్య వచ్చే సిరీస్‌ జనవరి 25న హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత విశాఖపట్నం (ఫిబ్రవరి 2-6), రాజ్‌కోట్ (ఫిబ్రవరి 15-19), రాంచీ (ఫిబ్రవరి 23-27), ధర్మశాల (మార్చి 7-11)లో ఇతర మ్యాచ్‌లు జరగనున్నాయి. విరుష్క దంపతులు త్వరలోనే రెండో బిడ్డకు జన్మనివ్వనున్నారు.

అక్టోబర్‌లో అనుష్క శర్మ రెండోసారి గర్భం దాల్చారు. అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ డిసెంబర్ 2017 లో వివాహం చేసుకున్నారు. వీరికి జనవరి 2021 లో వారి కుమార్తె వామిక జన్మించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+