ఆ సిరీస్‌కు టీమిండియా స్టార్ ప్లేయర్ దూరం
Bangladesh's tour of India: బంగ్లాదేశ్ జట్టు త్వరలో భారత్‌లో పర్యటించబోతోంది. రెండు టెస్టులు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఇది. సెప్టెంబర్ 19వ తేదీన తొలి టెస్ట్ షెడ్యూల్ అయింది. తొలి టెస్టుకు చెన్నై చెపాక్‌లోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. 27న రెండో టెస్ట్ జరుగనుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్ స్టేడియం దీని వేదిక.
అనంతరం మూడు టీ20 మ్యాచ్‌ల సిరిస్ మొదలవుతుంది. అక్టోబర్ 6వ తేదీన ధర్మాశాలలో తొలి మ్యాచ్. 9న ఢిల్లీ, 12న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలల్లో మిగిలిన రెండు టీ20 గేమ్ ఉంటాయి. హోమ్ సిరీస్‌లో భారత్‌ను ఢీ కొట్టే జట్టును బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఇంకా ప్రకటించాల్సి ఉంది.

భారత్ కంటే ముందు పాకిస్తాన్ పర్యటనకు బయలుదేరి వెళ్తుంది బంగ్లాదేశ్. అక్కడ రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ముగించుకున్న తరువాత ఇక్కడికి రానుంది. పాకిస్తాన్ పర్యటనకు వెళ్లే జట్టును ఇదివరకే ప్రకటించింది కూడా.
నజ్ముల్ హొస్సేన్ శాంటో నాయకత్వాన్ని వహించే ఈ జట్టులో మహ్మదుల్ హసన్ జాయ్, జకీర్ హసన్, షాద్మాన్ ఇస్లాం, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిట్టన్ దాస్, మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, నయీమ్ హసన్, నహిద్ రానా, షోరీఫుల్ ఇస్లాం మహమూద్, తస్కిన్ అహ్మద్, సయ్యద్ ఖలీద్ అహ్మద్.. పాకిస్తాన్ వెళ్లనున్నారు.

కాగా- బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్‌కు జస్‌ప్రీత్ బుమ్రా దూరం కానున్నాడు. రెండు టెస్టులకూ అతన్ని జట్టులోకి తీసుకోవట్లేదు. బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్‌కు తన పేరును పరిగణనలోకి తీసుకోవద్దని అతను బీసీసీఐకి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. విశ్రాంతి కోసం ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications