IND vs SA: రెండో మ్యాచ్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. టీమిండియా తుది జట్టు..!!

IND vs SA second T20: సూర్యకుమార్ సేన జోరు మీద ఉంది. తొలి టీ20 లో సౌతాఫ్రికా పైన అన్ని రంగాల్లో పై చేయి సాధించిన టీమిండియా రెండో మ్యాచ్ కు సిద్దమైంది. భారీ అంచనాలతో ఈ మ్యాచ్ బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని భావిస్తున్నది. అదే సమయంలో తొలి విజయం నమోదు చేసి సమం చేయాలని ప్రొటీస్‌ జట్టు కసితో ఉన్నది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు తొలి టీ20లో ఆడిన జట్టు లో మార్పులు జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. స్టార్ ప్లేయర్ ఈ మ్యాచ్ నుంచి ఔట్ కావటం ఖాయమని తెలుస్తోంది.

భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్ గురువారం జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ లో పట్టు పెంచుకోవాలని టీమిండియా భావిస్తోంది. అయితే, ఈ మ్యాచ్ కోసం తొలి టీ20 ఆడిన టీం నే కొనసాగిస్తుందా.. మార్పులు చేస్తుందా అనేది కీలకంగా మారుతోంది. తొలి టీ20 కోసం భారత్ వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్‌, హర్షిత్ రాణాలను టీమ్‌ మేనేజ్‌మెంట్‌ పక్కన పెట్టింది. శాంసన్‌ను పక్కనపెట్టి జితేష్‌ శర్మకు ప్రాధాన్యం ఇవ్వడం ఫ్యాన్స్ కు అంతు చిక్కలేదు.

Key Changes possible for Second T20 Between IND vs SA sanju samson may replace Gill

ఇక దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో గాయపడ్డ గిల్‌.. టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి టీ20లో నాలుగు పరుగులకే పెవిలియన్‌కు చేరి నిరాశ పరిచాడు. ఇటీవల కాలంలో గిల్‌ టీ20ల్లో విఫలమవుతూ వస్తున్నాడు. కటక్‌ టీ20లో తొలి ఓవర్‌లోనే గిల్‌ అవుట్‌ కావడంతో భారత బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెరిగింది.

ఇక చండీగఢ్‌లో జరిగే రెండో టీ20లో గిల్ ను కొనసాగిస్తారా.. లేక, సంజూ శాంసన్ కు అవకాశం ఇస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరగబోయే టీ20 ప్రపంచ కప్‌కు ముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రదర్శన కూడా ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ కప్‌కు ముందు అతను ఫామ్‌లోకి రావడం భారత్‌కు చాలా కీలకం. న్యూ చండీగఢ్‌లోని చల్లని వాతావరణంలో జరిగే మ్యాచ్‌లో భారత జట్టు కాంబినేషన్‌లో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు.

కటక్‌లో ఆడిన ప్లేయింగ్ ఎలెవన్‌నే ముల్లాన్‌పూర్‌లో కూడా భారత్ బరిలోకి దింపే అవకాశం ఉంది. గాయం నుంచి కోలుకుని జాతీయ జట్టులోకి తిరిగి వచ్చిన హార్దిక్ పాండ్యా మరోసారి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. భారత జట్టుకు తన అవసరం ఏంటో తన ఆటతోనే స్పష్టం చేసాడు. రెండో టీ20లో హార్దిక్ ఒక వికెట్ తీస్తే.. టీ20ల్లో 100 వికెట్లు పూర్తి చేసిన టీమిండియా మూడో బౌలర్‌గా నిలుస్తాడు. ఇప్పటి వరకు ఈ జాబితాలో అర్ష్‌దీప్‌ సింగ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+