నీ సంగతి చెప్తా..మహిళపై రెచ్చిపోయిన విరాట్ కోహ్లి
క్రికెట్ మైదానంలో తన ఆటతో ప్రత్యర్థులకు వణుకు పుట్టించే విరాట్ కోహ్లీ, మైదానం వెలుపల కూడా తన స్వభావం గురించి చర్చకు తావిస్తుంటాడు. తాజాగా, ఆస్ట్రేలియా పర్యటనలో తన కుటుంబం ఫోటోలు తీయడంపై కోపగించడం సంచలనం సృష్టించింది.ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్‌లో ముగిసిన మూడవ టెస్ట్ తర్వాత, కోహ్లి తన కుటుంబంతో కలిసి ఎయిర్‌పోర్టులో ఉన్న సమయంలో ఈ సంఘటన జరిగింది.ప్రతి ఒక్కరికీ తన వ్యక్తిగత జీవితంపై కొంత గోప్యత కావాలనే కోరిక ఉంటుంది.
కోహ్లీ కూడా తన కుటుంబం విషయంలో అదే కోరికను వ్యక్తం చేశాడు. అనుమతి లేకుండా తన కుటుంబం ఫొటోలు తీయడంపై ఆయన తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాడు. తన కుటుంబ సభ్యులు , పిల్లలను మీడియా కెమెరాలు చిత్రీకరిస్తున్నప్పుడు అసహనానికి లోనయ్యారు. తొలుత మీడియా ఆస్ట్రేలియా బౌలర్ స్టార్క్‌ను ఇంటర్య్వూ చేస్తుండగా,కుటుంబ సభ్యులతో కలిసి కోహ్లీ ఎయిర్‌పోర్టుకు రావడంతో మీడియా మొత్తం కూడా అతని వెనుక పరిగెత్తింది.

ముఖ్యంగా న్యూస్ చానెల్ 7 మహిళ రిపోర్టర్ కోహ్లీ కుటుంబ సభ్యులను ఫొటోలు తీయడానికి అత్యుత్సాహం చూపించారు. దీంతో ఆ చానెల్‌కు సంబంధించిన మహిళ రిపోర్టర్‌పై మండిపడ్డారు. ఆయన పిల్లలను ఫొటోలు తీయలేదని హామీ ఇచ్చిన తర్వాత కానీ కోహ్లీ శాంతించలేదు. ఆ హామీ తర్వాత, కోహ్లి చానెల్ 7 కెమెరామన్‌తో చేతులు కలిపి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇక బోర్డర్-గావాస్కర్ ట్రోఫీ ప్రస్తుతం 1-1తో సమస్థాయిలో ఉంది. ఇండియా పర్త్‌లో విజయం సాధించగా, ఆస్ట్రేలియా అడిలైడ్‌లో గెలిచి సమం చేసింది. బ్రిస్బేన్ టెస్టు వర్షం కారణంగా డ్రాగా ముగిసింది.ఇప్పుడు, డిసెంబర్ 26న ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టెస్టులో రెండు జట్లు మరోసారి తలపడనున్నాయి.












Click it and Unblock the Notifications