పరమ చెత్త రికార్డును మూటగట్టుకున్న కోహ్లీ
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో పెర్త్‌లో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ పరమ చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ సమయంలో ఓ సింపుల్ క్యాచ్‌ను వదిలిపెట్టేసిన కోహ్లీ చెత్త రికార్డును తన పేరున మూటగట్టుకున్నాడు. బుమ్రా బౌలింగ్‌లో ఆసీస్ ఆటగాడు లబుషేన్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను విరాట్ జారవిడిచాడు.
దీంతో గత ఐదేళ్లలో అత్యధిక క్యాచ్‌లు విడిచిపెట్టిన ఆటగాడిగా కోహ్లీ రికార్డులకెక్కాడు. 2019 నుంచి ఇప్పటి వరకు కోహ్లీ ఏకంగా 47 క్యాచ్‌లు విడిచిపెట్టాడు. కోహ్లీ తర్వాతి స్థానంలో టీమిండియా కెప్టెన్ రోహిత్‌శర్మ, కేఎల్ రాహుల్ ఉన్నారు. వీరిద్దరూ చెరో 21 క్యాచ్‌లు విడిచిపెట్టారు. 20 క్యాచ్‌లు విడిచిపెట్టిన సిరాజ్ వీరి తర్వాతి స్థానంలో ఉన్నాడు.

గ్రౌండ్‌లో బెస్ట్ ఫీల్డర్‌గా ఉండే కోహ్లీ ఇలా అత్యధిక సంఖ్యలో క్యాచ్‌లను విడిచిపెట్టి రికార్డు నెలకోల్పడంపై క్రికెట్ పండితులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక పెర్త్‌లో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టుబిగించింది. టీమిండియా తన సెకండ్ ఇన్నింగ్స్‌ను 487/6 పరుగులకు డిక్లేర్ చేసింది. విరాట్ కోహ్లీ సెంచరీతో అదరగొట్టాడు. 143 బంతుల్లో కోహ్లీ సెంచరీ బాదేశాడు. 8 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో విరాట్ కోహ్లీ ఈ సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 150 పరుగులు చేయగా, ఆసీస్ 104 పరుగులు చేసిన విషయం తెలిసిందే. దీంతో భారత్‌కు 46 పరుగుల ఆధిక్యం లభించింది. 100 పరుగులతో కోహ్లీ నాటౌట్‌గా నిలిచాడు.
534 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలో దిగిన ఆసీస్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్‌గా వచ్చిన నాథన్ ఆండ్రూ మెక్‌స్వీనీ వికెట్‌తో పాటు,మార్నస్ లాబుస్‌చగ్నే వికెట్‌లను బుమ్రా పడగొట్టాడు.ఆసీస్ కెప్టెన్ కమిన్స్ వికెట్‌ను హైదరాబాదీ బౌలర్ మహమ్మద్ సిరాజ్ తీశాడు. దీంతో భారత జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని అందినట్టు అయింది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండటంతో భారత జట్టు విజయం ఖాయమైనట్టే.












Click it and Unblock the Notifications