మెస్సీ మ్యాచ్ వేళ అభిమానుల విధ్వంసం..!!

ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత్ రాక వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భారత్ పర్యటనలో భాగంగా కోల్ కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఫుట్ బాల్ మ్యాచ్ ఏర్పాటు చేసారు. పెద్ద సంఖ్యలో అభిమానులు మెస్సీని చూసేందుకు తరలి వచ్చారు. కాగా, మ్యాచ్ సమయంలో మెస్సీ నిమిషాల్లోనే వెళ్లిపోవటం ఫ్యాన్స్ కు నచ్చలేదు. దీంతో, స్టేడియం లోనే విధ్వంసానికి దిగారు. కుర్చీలు ధ్వంసం చేసారు. స్టేడియంలోకి వాటర్ బాటిల్లు విసిరి వేసారు.

ఫ్యాన్స్ ఆగ్రహంతో మెస్సీ స్టేడియంలోని సొరంగం నుంచి వెళ్లిపోయారు. ఫ్యాన్స్ ను నియంత్రించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ప్రేక్షకులు స్టేడియంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిని పోలీసులు నియంత్రిస్తున్నారు. స్టేడియం లో గందర గోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి.

Lionel Messi leaves stadium crowd hurls bottles and vandalise seats in Kolkata

భారత్‌లో మెస్సీ టూర్‌ ప్రారంభమైంది. ఈ తెల్లవారు జామున మెస్సీ భారత్ చేరుకున్నారు. 14 ఏళ్ల తర్వాత భారత్‌లో పర్యటిస్తున్న మెస్సీ కోసం అభిమానులు పెద్ద సంఖ్యలో వేచి చూస్తున్నారు. మెస్సీ మేనియా కొనసాగుతోంది. హైదరాబాద్‌, కోల్‌కతా, ముంబై, ఢిల్లీలో మెస్సీ పర్యటన జరగనుంది. ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులను కలవనున్న మెస్సీ..హైదరాబాద్ లోనూ పర్యటించనున్నారు. కోల్ కతాలోని సాల్ట్ లేక్ స్టేడియం లో ఫుట్ బాల్ మ్యాచ్ ఏర్పాటు చేసారు.

వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ తరలి వచ్చారు. కాగా, స్టేడియం కు వచ్చిన మెస్సీ కొద్ది క్షణాల్లోనే వెళ్లిపోయారు. దీంతో.. స్టేడియం లో వేచి చూస్తున్న ప్రేక్షకులు ఆగ్రహానికి గురయ్యారు. గ్రౌండ్ లోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేసారు. ఫ్యాన్స్ ఆగ్రహం తో మెస్సీ అక్కడ నుంచి వెళ్లిపోయారు.

కాగా, మెస్సీ సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్నారు. ఫలక్ నుమా ప్యాలెస్ లో బస చేస్తారు. నేటి రాత్రి మెస్సీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒకే మైదానంలో బరిలోకి దిగి ప్రజలను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఉప్పల్ స్టేడియంలో జరుగనున్న మెస్సీ గోట్ టూర్.. సంగీత విభావరితో మొదలవనుంది. ఆ తరువాత ఎగ్జిబిషన్ మ్యాచ్ మొదలవుతుంది. ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఆర్‌ఆర్ 9 వర్సెస్ మెస్సీ ఆల్ స్టార్స్ జట్లు తలబడనున్నాయి.

20 నిమిషాల పాటు జరిగే ఈ మ్యాచ్‌లో ఆఖరి ఐదు నిమిషాల్లో మెస్సీ, రేవంత్ రెడ్డి మైదానంలో బరిలోకి దిగుతారు. నిర్ణీత సమయం ముగిశాక రేవంత్, మెస్సీ పెనాల్టీ షూటౌట్‌లు ఆడతారు. ఇప్పటికే మెస్సీ పర్యటన వేళ భారీ భద్రత ఏర్పాటు చేసారు. అభిమానులు సైతం పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో మెస్సీ మేనియా కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+