T20 World Cup 2026: బీసీసీఐకి బిగ్ షాక్..! టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ మార్పు..!
భారత్-బంగ్లాదేశ్ మధ్య చోటు చేసుకుంటున్న ఉద్రిక్త పరిస్ధితులు టీ20 వరల్డ్ కప్ కు సమస్యగా మారాయి. ముఖ్యంగా ఈ మెగా టోర్నీకి ఆతిధ్యమిస్తున్న భారత్ కు ఇబ్బందికరంగా మారాయి. బంగ్లాదేశ్ లో హిందువుల హత్యలను సాకుగా చూపుతూ ఆ దేశ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను ఐపీఎల్ నుంచి అర్ధాంతరంగా తప్పించిన బీసీసీఐకి.. మీ దేశంలో వరల్డ్ కప్ మ్యాచ్ లు ఆడబోమని చెప్పి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు షాకిచ్చింది. దీంతో ఐసీసీ కూడా ఇరుకునపడింది.
బంగ్లాదేశ్ లో హిందువుల హత్యల వ్యవహారాన్ని ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసిన బంగ్లాదేశ్ ఆటగాడు
ముస్తాఫిజుర్ రెహ్మాన్ కు ముడిపెట్టి దూకుడుగా వ్యవహరించిన బీసీసీఐకి.. ఆ దేశ క్రికెట్ బోర్డు షాకి్చ్చింది. వచ్చే నెలలో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లను భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్ నుంచి మార్చాలని ఐసీసీని కోరింది. దీంతో ఇప్పుడు బంగ్లాదేశ్ విజ్ఞప్తిపై స్పందించిన తప్పని పరిస్ధితి ఐసీసీకి ఎదురవుతోంది.

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తిపై ఐసీసీ ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే బంగ్లాదేశ్ లేకుండా భారత్ లో టీ20 వరల్డ్ కప్ నిర్వహించే పరిస్ధితి కూడా లేకపోవడంతో ఈ మెగా టోర్నీ షెడ్యూల్ లో ఐసీసీ మార్పులు చేస్తోంది. బంగ్లాదేశ్ ఆడాల్సిన మ్యాచ్ లను భారత్ నుంచి శ్రీలంకకు మారుస్తూ కొత్త షెడ్యూల్ ను ఐసీసీ సిద్ధం చేసినట్లు సమాచారం. దీన్ని త్వరలోనే విడుదల చేయబోతోంది. అయితే తప్పనిసరి పరిస్ధితుల్లో ఇలా షెడ్యూల్ మారుస్తున్న ఐసీసీ భారీ నష్టాలు ఎదుర్కోక తప్పేలా లేదు.

ఫిబ్రవరి 7న టీ20 వరల్డ్ కప్ భారత్ లో ప్రారంభం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భారత్ లో వేదికల్ని కూడా భారీ ఎత్తున సిద్దం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో షెడ్యూల్ మార్పు వల్ల ఇటు భారత్ లో, అటు శ్రీలంకలో రెండు చోట్లా ఐసీసీకి ఆర్ధికంగా నష్టం తప్పదు. అయినా ఐసీసీ అలాగే ముందుకెళ్లక తప్పని పరిస్ధితి ఎదురవుతోంది. లేకపోతే టీ20 వరల్డ్ కప్ ను సకాలంలో నిర్వహించలేకపోయారన్న అపప్రదను ఎదుర్కోక తప్పదు. దీంతో ఐసీసీ ఆర్ధిక భారాన్ని కూడా భరించి షెడ్యూల్ లో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొత్త షెడ్యూల్ ను ఇవాళ, రేపట్లో ప్రకటించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications