స్టార్ క్రికెటర్ గుడ్‌బై

ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ క్రికెటర్, వికెట్ కీపర్ బ్యాటర్ మాథ్యూ వేడ్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆ దేశ జాతీయ జట్టు కోచింగ్ స్టాఫ్‌లో చేరనున్నాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. వేడ్‌ను కోచింగ్ స్టాఫ్‌గా అపాయింట్ చేయనున్నట్లు తెలిపింది.

2011లో అక్టోబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు వేడ్. 36 టెస్టులు, 97 వన్డేలు, 92 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. మూడు ఫార్మట్లల్లో 225 మ్యాచ్‌లను ఆడాడీ వికెట్ కీపర్ బ్యాటర్. ఈ ఏడాది జూన్‌లో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ అతని కేరీర్‌లో చివరి టోర్నమెంట్. టీ20 స్పెషలిస్ట్‌గా అతనికి గుర్తింపు ఉంది. అదేస్థాయిలో మ్యాచ్‌లను ఆడాడు.

Matthew Wade has retired from international cricket

రిటైర్మెంట్‌పై మాథ్యూ వేడ్ మాట్లాడాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 తరువాత రిటైర్మెంట్ ప్రకటించాల్సిన సమయం వచ్చిందనే విషయం తెలుసునని, ఎక్కువ కాలం ఈ ఫార్మట్‌లో కొనసాగకూడదని నిర్ణయించుకున్నానని అన్నాడు. రిటైర్మెంట్ విష.యంపై కోచ్ జార్జ్ బెయిలీ, ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌తో మాట్లాడానని, ఆరు నెలల కిందటే వారికి ఈ సమాచారం ఇచ్చానని తెలిపాడు.

సుదీర్ఘకాలంగా దేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం కల్పించినందుకు క్రికెట్ ఆస్ట్రేలియాకు వేడ్ కృతజ్ఞతలు తెలిపాడు. బిగ్ బాష్ లీగ్స్‌లల్లో ఆడతానని, ఆ టోర్నమెంట్ ఫ్రాంచైజీ లీగ్‌లను అందుబాటులో ఉంటానని పేర్కొన్నాడు. జాతీయ జట్టులో కోచింగ్ స్టాఫ్‌గా కొత్త బాధ్యతలను నిర్వర్తిస్తానని అన్నాడు.

Matthew Wade has retired from international cricket

పాకిస్తాన్‌తో జరగబోయే వన్డే, టీ20 ఇంటర్నేషన్స్ సిరీస్ కోసం కోచింగ్ స్టాఫ్‌గా వేడ్ బాధ్యతలను స్వీకరించే అవకాశం ఉంది. ఇంకొద్ది రోజుల్లో ఈ సిరీస్ ఆరంభం కానుంది. మెల్‌బోర్న్‌లో తొలి మ్యాచ్ జరుగనుంది. అదే సమయంలో బిగ్ బాష్ లీగ్‌లో టాస్మానియా హోబర్ట్ హరికేన్స్ తరపున దేశవాళీ క్రికెట్‌కు అందుబాటులో ఉండటం ఖాయమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+