World Cup 2023: ఫైనల్ లో భారత్ ను ఆపలేరు, కానీ- కేన్ విలియమ్సన్..!!
ప్రపంచ కప్ లో టీమిండియా ఫైనల్ చేరింది. ఫైనల్స్ లో రోహిత్ టీంతో తల పడేది ఎవరో ఈ రోజు తేలనుంది. ఆస్ట్రేలియా వర్సస్ సౌతాఫ్రికా మధ్య రెండో సెమీస్ కోల్ కతాలో జరుగుతోంది. ఇక, సెమీస్ లో టీం ఇండియా పైన తుది వరకు పోరాడి ఓడిన న్యూజీలాండ్ కెప్టెన్ విలియమ్సన్ ఫైనల్ మ్యాచ్ పైన తన అంచనాలు వెల్లడించారు. సెమీస్ లో టీం ఇండియా ఆట తీరును ప్రశంసించారు. ఫైనల్ లో ఎవరిదో పై చేయి స్పష్టం చేసారు.
విలియమ్సన్ వ్యాఖ్యలు : సెమీస్ లో టీం ఇండియా ఆడిన తీరును మరోసారి విలియమ్సన్ ప్రశంసించారు. ఫైనల్ మ్యాచ్ పైన ఆసక్తి కర విశ్లేషణ చేసారు. ఫైనల్‌లో భారత్‌ను ఆపడం చాలా కష్టమని కీవీస్ కెప్టెన్ కెన్ విలియమ్సన్ పేర్కొన్నారు. ప్రస్తుతం టీమిండియా ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టు అని విలియమ్సన్ వ్యాఖ్యానించారు. భారత్ ఆటగాళ్ల ప్రదర్శన చూస్తుంటే ఫైనల్లో ఆపడం ఏ జట్టుకైనా కష్టతరమేనని అభిప్రాయపడ్డారు.భారత ఆటగాళ్లు అత్యుత్తమ క్రికెట్ ఆడుతున్నారని, ఒక్క ఓటమి కూడా లేకుండా చెలరేగుతున్న ఆతిథ్య జట్టుని ఫైనల్లో ఆపడం అంత సులభం కాబోదని పేర్కొన్నారు. ఇలాంటి పెద్ద టోర్నీల్లో అన్ని జట్ల పైనా గెలుస్తూ ఫైనల్ కు చేరటం అంత సులభమైన విషయం కాదన్నారు.

ఇండియాను ఎదుర్కోవటం కష్టం : ఏ టీంకు అయినా సాధారణంగా వైఫల్యాలు ఎదురవుతుంటాయని... అలాంటి సమయంలో ఎలా వ్యవహరిస్తామనేది ముఖ్యమని విలియమ్సన్ వివరించారు. కానీ టీమిండియా ఈ టోర్నీలో నిజంగా అద్భుతంగా ఆడుతోందన్నారు. కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సెమీఫైనల్ చేరుకున్నారని అభినందించారు. ప్రతి మ్యాచ్‌లోనూ అదరగొట్టారననారు. సెమీఫైనల్లోనూ అదే చేశారని చెప్పుకొచ్చారు. ఆత్మవిశ్వాసంతో ఫైనల్‌కు వెళ్లారనడంలో ఎలాంటి సందేహం లేదుని పేర్కొన్నారు. సెమీ-ఫైనల్‌లో టీమిండియా గెలుపు త్వర్వాత కేన్ విలియమ్సన్ ఈ వ్యాఖ్యలు చేసిన విలియమ్సన్ ఫైనల్ కు భారత్ ప్రత్యర్ధి ఎవరైనా రోహిత్ సేనను అడ్డుకోవటం కష్టమనే అభిప్రాయం వ్యక్తం చేసారు.

ఇండియా నాణ్యమైన జట్టు : పిచ్ విషయంలో వస్తున్న కామెంట్స్ కు స్పందించారు. పిచ్ విషయంలో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. పిచ్ ఇరు జట్లకు అనుకూలంగానే వ్యవహరించిందని విశ్లేషించారు. నాకౌట్ దశలో ఓడిపోవటం తమకు బాధ కలిగించిందని చెప్పారు. నాణ్యమైన జట్టుతో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమిస్తున్నామని వివరించారు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ లో టీం ఇండియా అత్యుత్తమంగా రాణిస్తోందని విలియమ్సన్ చెప్పుకొచ్చారు. ఇక, ఈ నెల 19న అహ్మదాబాద్ లో జరిగే ఫైనల్ మ్యాచ్ లో రోహిత్ సేన ఫైనల్స్ లో ఈ రోజున రెండో సెమీస్ లో గెలిచే జట్టుతో తలపడనుంది. ఫైనల్ కోసం టీమిండియా పైన భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.












Click it and Unblock the Notifications