2036 ఒలింపిక్స్ భారత్ లో- హైదరాబాద్ ఆతిథ్యం..!!
మరో సారి ప్రపంచ స్థాయి క్రీడా సమరానికి భారత్ వేదిక కావాలని కోరుకుంటోంది. 2010 లో కామన్ వెల్త్ గేమ్స్ నిర్వహించిన భారత్.. ఇప్పుడు 2036 ఒలింపిక్స్ నిర్వహణ కోసం పోటీలోకి దిగింది. ఈ విషయం పైన ఇప్పటికే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి ఓ లేఖను సమర్పించింది. అహ్మదాబాద్ కేంద్రంగా ఒలింపిక్స్ నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. భారత్ కు ఒలింపిక్స్ బిడ్ దక్కితే దేశంలోని ప్రముఖ నగరాల్లో ఈవెంట్స్ నిర్వహణకు కసరత్తు చేస్తోంది. అందులో తెలుగు రాష్ట్రాలకు అవకాశం దక్కనుంది.
ఒలింపిక్స్ నిర్వహణ కోసం
కేంద్ర ప్రభుత్వం 2036 ఒలింపిక్స్ అతిథ్యం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందు కోసం భారత్ తో పాటు దక్షిణ కొరియా, మెక్సికో, ఇండోనేసియా, తుర్కియే, పోలెండ్, ఈజిప్ట్, పోటీపడుతున్నాయి. 2028 ఒలింపిక్స్‌కు లాస్‌ఏంజి లెస్, ఆ తర్వాత 2032 ఒలింపిక్స్‌కు బ్రిస్బేన్ ఆతిథ్యమివ్వనున్నాయి. 2036 కోసం పోటీ దేశాలతో సమానంగా భారత ప్రయత్నాలు చేస్తోంది. భారత్ కు బిడ్ దక్కితే దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లోని వసతులకు తగిన విధంగా ఈవెంట్ల నిర్వహణకు కసరత్తు కొనసాగుతోంది. ఇందు కోసం కొన్ని క్రీడల నిర్వహణ పైన ప్రతి పాదనలు సిద్దమయ్యాయి.

ప్రధాన నగరాలకు అవకాశం
ఒడిశాలో హాకీ, రోయింగ్ ఈవెంట్లను భోపాల్‌లో, నోయింగ్, కయాకింగ్‌లకు పుణె వేదికగా నిర్వహిం చేలా ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. అదే సమయంలో క్రికెట్ కోసం ముంబయి, దిల్లీ, అహ్మ దాబాద్ నగరాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక, ఇండోర్ ఈవెంట్లకు చాలా వరకు అహ్మదాబాద్ లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదిక కానుంది. పెద్ద మొత్తంలో ఈవెంట్లను ఆర్గనైజ్ చేసేందుకు అవసర మయ్యే అన్ని వసతులు అక్కడ ఉన్నాయి. ఖర్చును తగ్గించడం కోసం ఏ ఆతిథ్య దేశమైనా సరే ఒలింపిక్ క్రీడలను ఒకటి కంటే ఎక్కువ నగరాల్లో నిర్వహించడానికి వీలు కల్పించే ప్రతిపాదనకు అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ) 2014లోనే ఆమోదం తెలిపింది.
హైదరాబాద్ కేంద్రంగా
దీంతో, భారత్ కు అవకాశం దక్కితే తెలుగు రాష్ట్రాలకు ఒలింపిక్ ఆటలకు ఆతిథ్య జాబితాలో ఉన్నాయి. హైదరాబాద్ కేంద్రంగా క్రీడల నిర్వహణకు అన్ని రకాలుగా సదుపాయాలు అందు బాటులో ఉన్నాయి. అదే విధంగా ఏపీలో అమరావతి, విశాఖ కేంద్రాలను విశ్వ క్రీడలకు అనుకూ లంగా తీర్చి దిద్దుతామని చెబుతున్నారు. అయితే, హైదరాబాద్ లో మాత్రం ఒలింపిక్ క్రీడలు నిర్వహించే అవకాశం వదులుకోకూడదని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రం ప్రస్తుతం చేస్తున్న సంప్రదింపుల గురించి ఆరా తీస్తోంది. కేంద్రంతోనూ హైదరాబాద్ లో నిర్వహణ పైన ప్రతిపాదన లు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైనట్లు సమాచారం.












Click it and Unblock the Notifications