ఇండియాని కాదు.. అందరినీ కొడతాం! పాక్ కెప్టెన్ గాల్లో మేడలు!

Asian Games 2026: జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించడమే తమ ప్రధాన లక్ష్యమని పాకిస్తాన్ పురుషుల క్రికెట్ జట్టు కెప్టెన్ సాహిబ్జాదా ఫర్హాన్ స్పష్టం చేశారు. టోర్నీకి రెండు నెలల ముందే జట్టును ఖరారు చేయడం వల్ల ఆటగాళ్లకు పరస్పరం సమన్వయం పెంచుకోవడానికి, కలిసి సన్నద్ధం కావడానికి తగినంత సమయం లభించిందని ఆయన వెల్లడించారు. ఇప్పుడు ఆ ముందస్తు సన్నాహాలను స్టేడియంలో ప్రతిఫలించేలా చేసి ఫలితాలు రాబట్టడంపైనే తమ పూర్తి దృష్టి కేంద్రీకృతమే ఉందని తెలిపారు.

IND vs SL: పసిడి పంచ్‌తో భారత్ అదుర్స్.. శ్రీలంకపై భారీ విజయం!
IND vs SL: పసిడి పంచ్‌తో భారత్ అదుర్స్.. శ్రీలంకపై భారీ విజయం!

వాతావరణ సవాళ్లు, ముందస్తు ప్రాక్టీస్
పాకిస్తాన్‌తో పోలిస్తే జపాన్‌లోని వాతావరణం, పిచ్ పరిస్థితులు భిన్నంగా ఉంటాయని.. అయితే వీటన్నింటినీ ముందుగానే ఊహించి సిద్ధమయ్యామని ఫర్హాన్ పేర్కొన్నారు. వాతావరణం లేదా మైదాన పరిస్థితులు ఆటగాళ్ల నియంత్రణలో ఉండవని, అందువల్ల ఎలాంటి సవాలు ఎదురైనా తట్టుకునేలా పాకిస్తాన్‌లోనే ప్రత్యేక ప్రాక్టీస్ సెషన్లు నిర్వహించామని చెప్పారు. ఆసియా క్రీడల్లో పాకిస్తాన్ జట్టుకు నాయకత్వం వహించే అవకాశం రావడం తనకూ, తన కుటుంబానికీ దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

Pakistan Captain Sahibzada Farhan Targets Asian Games 2026 Gold Says Team Ready for Every Challenge

జట్టు ఫామ్ గురించి కీలక వ్యాఖ్యలు
కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించినప్పటికీ తన బ్యాటింగ్ శైలిలో ఎలాంటి మార్పు ఉండదని, సాధారణ ఆటగాడిలాగే స్వేచ్ఛగా, సహజ సిద్ధమైన శైలిలోనే విరుచుకుపడతానని సాహిబ్జాదా ఫర్హాన్ స్పష్టం చేశారు. జట్టులోని ఆటగాళ్లందరూ అంతర్జాతీయ అనుభవం ఉన్నవారేనని, వారి ప్రతిభ ఆధారంగానే ఎంపికయ్యారని అన్నారు. ముఖ్యంగా బ్యాటర్ హైదర్ అలీ మంచి ఫామ్‌లో ఉండటం జట్టుకు ప్లస్ పాయింట్ అని పేర్కొన్నారు. కొత్త ముఖాలు ఉన్నప్పటికీ.. పెద్ద వేదికపై గెలిచేందుకు తమ జట్టు సర్వసన్నద్ధంగా ఉందన్నారు.

భారత్‌లో సిరీస్ ఆడుతుండగానే బిగ్ షాక్.. ఆ ఆటగాళ్లకు భారీ కోత!
భారత్‌లో సిరీస్ ఆడుతుండగానే బిగ్ షాక్.. ఆ ఆటగాళ్లకు భారీ కోత!

భారత్‌తో మ్యాచ్, భవిష్యత్ లక్ష్యాలు
ఫైనల్లో భారత్‌తో తలపడే అవకాశం ఉందా అనే ప్రశ్నకు స్పందిస్తూ.. తమ దృష్టి కేవలం ఒక్క మ్యాచ్ పైనే కాకుండా టోర్నీలోని ప్రతి మ్యాచ్‌పై సమానంగా ఉంటుందని సాహిబ్జాద్ ఫర్హాన్ చెప్పారు. స్వర్ణం గెలవాలంటే అన్ని అగ్రశ్రేణి జట్లను ఓడించాల్సిందేనని.. భారత్ తో ఆడేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ మ్యాచ్ కు ముందే గెలుపుపై గొప్పలు చెప్పుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో పాకిస్తాన్ టీ20 జాతీయ జట్టుకు పూర్తి స్థాయి కెప్టెన్ గా వ్యవహరించే అవకాశం వస్తే ఆ బాధ్యతను స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు సాహిబ్జాదా ఫర్హాన్ తన కోరికను వెల్లడించారు.

ఆసియా క్రీడల కోసం పాకిస్థాన్ జట్టు: సాహిబ్జాదా ఫర్హాన్ (కెప్టెన్), అబ్దుల్ సమద్ (వైస్ కెప్టెన్), అబ్రార్ అహ్మద్, అహ్మద్ డానియాల్, అకిఫ్ జావేద్, అలీ రజా, అరాఫత్ మిన్హాస్, హైదర్ అలీ, హసన్ నవాజ్, మాజ్ సదాకత్, మహ్మద్ వసీం సుక్వేమ్, సయాదిమ్, సయాదిమ్. ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్).

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+