శ్రీలంక హోటల్ మహిళా సిబ్బందితో పాక్ క్రికెటర్ అసభ్య ప్రవర్తన- ఆ వెంటనే..!!

పాకిస్థాన్ క్రికెటర్లు మరోసారు పరువు పోగొట్టుకున్నారు. ఆ జట్టుకు చెందిన ఓ క్రికెటర్ వివాదంలో చిక్కుకున్నాడు. టీ20 వరల్డ్​కప్​ టోర్నమెంట్ నుంచి ఇప్పటికే నిష్క్రమించిన పాకిస్థాన్ తాజా వివాదంలో అంతర్జాతీయ స్థాయిలో చర్చకు కారణంగా నిలిచింది. బస చేసిన హోటల్​లోని మహిళా సిబ్బందితో క్రికెటర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగు లోకి వచ్చింది. దీని పైన పాక్ క్రికెట్ బోర్డు స్పందించింది. పాక్ టీం తీరు పైన సోషల్ మీడియా వేదికగా నెటిజెన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.

టీ20 ప్రపంచ కప్ లో సూపర్ -8 దశలో పాక్ ఇంటి బాట పట్టింది. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి లో ఆ జట్టు పరువు పొగొట్టుకుంది. పాకిస్థాన్‌ క్రికెటర్ ఒకరు కొలంబోలోని హోటల్‌కు చెందిన మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించిన అంశం బయటకు రావటం విమర్శలకు కారణంగా నిలుస్తోంది. టీ-20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ తన అన్ని మ్యాచ్‌లను శ్రీలంకలోనే ఆడింది. కాగా, శ్రీలంకతో సూపర్-8 మ్యాచ్‌కు ముందు క్యాండీలోని హోటల్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళతో ఓ పాక్ క్రికెటర్ అనుచితంగా ప్రవర్తించిన అంశం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఫిబ్రవరి 28న సూపర్- 8 దశలో పాకిస్థాన్ తమ ఆఖరి మ్యాచ్​ను పల్లెకెలె స్టేడియం వేదికగా శ్రీలంకతో ఆడింది. అయితే ఈ మ్యాచ్​కు ముందు పాక్​ జట్టు కాండీలోని గోల్డెన్ క్రౌన్ హోటల్‌లో బస చేసింది. ఈ క్రమంలో హౌస్​కీపింగ్​ పనిచేస్తున్న మహిళా సిబ్బందితో పాక్ ఆటగాడు అనుచితంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.

pakistan-cricketer-fined-for-misbehaving-with-female-hotel-staff-in-kandy-before-super-8-clash-again

జట్టు యాజమాన్యానికి ఫిర్యాదు

పాక్ క్రికెటర్ తీరుతో ఆ మహిళ సాయం కోసం గట్టిగా కేకలు వేసింది. దీంతో.. మిగిలిన హోటల్ సిబ్బంది వచ్చి ఆమెకు మద్దతుగా నిలిచారు. ఈ ఘటన పైన హోటల్ సిబ్బంది అందరూ కలిసి ఆ క్రికెటర్‌పై యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఆ హోటల్ యాజమాన్యం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని పాక్ టీమ్ మేనేజర్ నవీద్ చీమాకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. కాగా, ఈ ఘటన పైన వచ్చిన ఫిర్యాదు మేరకు ఆటగాళ్ల తరఫున నవీద్ చీమా ఆ మహిళకు, హోటల్ సిబ్బందికి క్షమాపణలు చెప్పినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మహిళా సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన ఆ క్రికెటర్‌కు భారీ జరిమానా విధించారు. ఇక.. ఆ క్రికెటర్ పీసీబీ క్రమశిక్షణ కమిటీ ముందు కూడా హాజరుకాబోతున్నాడు. ఈ నేపథ్యంలో అతడికి మరిన్ని శిక్షలు విధించే అవకాశం కనబడుతోంది. ఇప్పుడు ఈ ఘటన పైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. నెటిజన్లు పాకిస్థాన్ క్రికెట్ టీమ్​ పైన ఫైర్ అవుతున్నారు. మెగా టోర్నీలో పాల్గొంటూ ఇలాంటి పనులు చేయడమేంటని సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+