సూపర్ 8 రసవత్తరం:పాకిస్తాన్ ఇంటి దారి పట్టుడే ఇక- శ్రీలంక నిష్క్రమణతో..!!
టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ రేసులో శ్రీలంకపై న్యూజిలాండ్ ఘన విజయం విజయం సాధించింది. ఏకంగా 61 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించింది. ఈ గెలుపుతో శ్రీలంక వరల్డ్ కప్ ఆశలపై నీళ్లు చల్లింది న్యూజిలాండ్. సూపర్ 8 దశలోనే ఆ జట్టు జర్నీ ముగిసింది. సెమీస్ కు అర్హత సాధించలేకపోయింది. బుధవారం రాత్రి కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన కివీస్.. నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేయగా.. దాన్ని అందుకోలేకపోయింది శ్రీలంక. 107 పరుగుల వద్దే కుప్పకూలింది.
ఈ గెలుపుతో సెమీ ఫైనల్స్ అడుగు దూరంలో నిలిచింది న్యూజిలాండ్. రెండు మ్యాచ్‌ల తర్వాత 3 పాయింట్లను సాధించింది. మెరుగైన నెట్ రన్ రేట్ తో సెమీస్ కు చేరువలో ఉంది. తన తదుపరి/చివరి మ్యాచ్ లో ఇంగ్లాండ్‌తో తలపడాల్సి ఉంది న్యూజిలాండ్ కు. ఇంగ్లాండ్ ను ఓడించినా లేదా రద్దు అయినా నేరుగా సెమీస్ కు చేరుకుంటారు బ్లాక్ క్యాప్స్. ఎటువంటి రన్ రేట్లతో వారికి అవసరం ఉండదు.

ఒకవేళ ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోతే మాత్రం నెట్ రన్ రేట్ మీద ఆధారపడాల్సి వస్తుంది న్యూజిలాండ్ కు. అదే సమయంలో పాకిస్తాన్ కూడా తన తదుపరి మ్యాచ్ లో గెలిస్తే న్యూజిలాండ్ కు గట్టిపోటీ ఇస్తుంది. నెట్ రన్ రేట్ కీలకంగా మారుతుంది. ప్రస్తుతానికి పాకిస్తాన్ జట్టు రెండు మ్యాచ్‌లలో ఒక పాయింట్‌తో చివరి స్థానంలో ఉంది. న్యూజిలాండ్ తో జరగాల్సిన మ్యాచ్ రద్దుకావడం వల్ల వచ్చిందా ఒక్క పాయింట్ కూడా.
ప్రస్తుతం న్యూజిలాండ్ చేతిలో మూడు పాయింట్లు, ఒక మ్యాచ్ మిగిలివుంది. ఆ మిగిలిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ ను ఢీ కొట్టాలి. ఆ మ్యాచ్ లో గెలిస్తే రెండు పాయింట్లు దక్కుతాయి. దీంతో మొత్తం అయిదు పాయింట్లతో నేరుగా సెమీస్ చేరుకుంటుంది. ఓడిపోతే మూడు పాయింట్లకే పరిమితమౌతుంది. ఈ ఓటమి పాకిస్తాన్ కు ప్లస్ అవుతుంది.
ప్రస్తుతం పాకిస్తాన్ చేతిలో ఒక పాయింట్, ఒక మ్యాచ్ మిగిలివుంది. ఆ మ్యాచ్ లో శ్రీలంకను ఎదుర్కొనాల్సి ఉంది. ఇందులో పాకిస్తాన్ గెలిస్తే న్యూజిలాండ్ తో సమానంగా మూడు పాయింట్లను దక్కించుకుంటుంది. ఓడిపోతే పాకిస్తాన్ కూడా శ్రీలంక లాగా ఇంటిదారి పడుతుంది. గెలిస్తే న్యూజిలాండ్ తో సమాన పాయింట్లు సాధించినందు వల్ల నెట్ రన్ రేట్ కీలకంగా మారుతుంది.
సెమీఫైనల్‌కు పాకిస్తాన్ అర్హత సాధించాలంటే ఇంగ్లాండ్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. న్యూజిలాండ్‌ను భారీ తేడాతో ఓడించి, పాకిస్తాన్ శ్రీలంకపై మంచి తేడాతో గెలిస్తేనే సల్మాన్ ఆఘా టీమ్ సెమీస్ కు చేరుకోగలదు. ఈ ప్రపంచ కప్ లో తమ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే పాకిస్తాన్ కు నెట్ రన్ రేట్ అత్యంత కీలకమైన అంశం.
- ఇంగ్లాండ్ న్యూజిలాండ్‌ను భారీ తేడాతో ఓడించాలి. ఇంగ్లాండ్ న్యూజిలాండ్‌ను 50 పరుగుల తేడాతో ఓడిస్తే, పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసి 200 పరుగులు చేయాలి. శ్రీలంకపై 20 పరుగులకు పైగా తేడాతో గెలవాల్సి ఉంటుంది.
- ఒకవేళ ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌ను 40 పరుగుల తేడాతో ఓడిస్తే, పాకిస్థాన్ 200 పరుగులు చేసి మొదట బ్యాటింగ్ చేస్తే, శ్రీలంకపై 28-30 పరుగుల తేడాతో గెలవాల్సిన అవసరం ఉంది.
- ఇంగ్లాండ్ న్యూజిలాండ్‌పై కేవలం 10 పరుగుల తేడాతో విజయం సాధిస్తే, పాకిస్తాన్ శ్రీలంకపై దాదాపు 56 పరుగుల కంటే ఎక్కువ తేడాతో గెలవాలి. ఇది చాలా పెద్ద విజయ మార్జిన్ అవుతుంది.
- ఇంగ్లాండ్ న్యూజిలాండ్‌ను ఒక్క పరుగు తేడాతో మాత్రమే ఓడిస్తే, పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసి 200 పరుగులు సాధించి, శ్రీలంకను 67 పరుగుల కంటే ఎక్కువ తేడాతో ఓడించాల్సి వస్తుంది.
-
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
ఒక్క దెబ్బతో దివాలా తీసిన పాకిస్థాన్.. చరిత్రలో తొలిసారి ఆ పని చేసేందుకూ రెడీ.. -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications