Paris Olympics 2024:భారత్ కొంపముంచిన అంపైర్లు..హాకీ సెమీస్‌లో పోరాడి ఓడిన టీమిండియా..!
India vs Germany Hockey Semis:పారిస్ ఒలింపిక్స్‌లో భాగంగా మంగళవారం భారత్ జర్మనీ మధ్య జరిగిన హాకీ సెమీఫైనల్స్‌లో జర్మనీ ఘనవిజయం సాధించింది. ఆట ప్రారంభం నుంచే జర్మనీ జట్టుపై ఏకధాటిగా దాడి చేశారు భారత కుర్రాళ్లు.ఆట తొలి క్వార్టర్‌లోనే భారత్‌కు పెనాల్టీ కార్నర్ రూపంలో చాలా అవకాశాలు వచ్చాయి. అయితే ఆట 7వ నిమిషంలో ఒక పెనాల్టీ కార్నర్‌ను మాత్రమే గోల్‌గా మలచడంలో భారత్ సక్సెస్ అయ్యింది.దీంతో తొలి క్వార్టర్ ముగిసే సమయానికి భారత్ 1-0 తేడాతో ముందంజలో ఉన్నింది.
ఇక రెండో క్వార్టర్ ప్రారంభం అయ్యాక జర్మనీకి 18వ నిమిషంలో అందివచ్చిన పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంలో విజయవంతమైంది. దీంతో స్కోరు 1-1గ సమం అయ్యింది. రెండో క్వార్టర్‌లో కూడా భారత్ జోరును కొనసాగించింది. జర్మనీ ఆటగాళ్లను ముప్పు తిప్పలు పెట్టారు భారత ఆటగాళ్లు.రెండో క్వార్టర్ ముగిసేందుకు మరో 7 నిమిషాలుండగా అందివచ్చిన చక్కటి అవకాశాన్ని భారత్ చేజార్చుకుంది. లలిత్ వద్దకు బంతి రాగా దాన్ని గోల్ వేసందుకు ప్రయత్నించగా గురి తప్పి అవతల పడింది. రెండో క్వార్టర్ చివరిలో 27వ నిమిషంలో జర్మనీకి పెనాల్టీ కార్నర్ దక్కింది.దాన్ని శ్రీజేష్ విజయవంతంగా అడ్డుకున్నాడు. అదే సమయంలో జర్మనీ రివ్యూకు వెళ్లగా థర్డ్ అంపైర్ పెనాల్టీ స్ట్రోక్ ఇచ్చాడు. దీంతో జర్మనీ దాన్ని సద్వినియోగం చేసుకుని గోల్ చేసి 2-1తో లీడ్‌లోకి వచ్చింది.

హాఫ్ టైమ్ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే భారత్‌కు పెనాల్టీ కార్నర్ లభించింది.అయితే దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. మళ్లీ పెనాల్టీ కార్నర్ లభించింది. దీన్ని జర్మనీ గోల్ కీపర్ అద్భుతంగా అడ్డుకున్నాడు.నిరాశ చెందిన భారత ఆటగాళ్లు ఆటను కొనసాగించారు. మళ్లీ పెనాల్టీ కార్నర్ దక్కింది. ఈసారి మాత్రం కెప్టెన్ హర్మన్ ప్రీత్ ఫ్లిక్ చేయగా సఖ్జీత్ సింగ్ గోల్‌లోపలికి కనెక్ట్ చేయడంతో భారత్‌కు గోల్ దక్కింది. దీంతో స్కోరు 2-2గా సమం అయ్యింది.ఆ తర్వాత భారత్ గోల్ పోస్టు పై జర్మనీ వేగవంతంగా దాడి చేసింది. భారత్ ఆటగాళ్లు అడ్డుకున్నారు.మూడో క్వార్టర్ ముగిసే సమయానికి రెండు జట్లు రెండు గోల్స్‌తో సమంగా నిలిచాయి.
ఇక చివరి క్వార్టర్ ప్రారంభమైన కొద్దిసేపటికే జర్మనీకి పెనాల్టీ కార్నర్ దక్కింది. భారత్ రివ్యూకు వెళ్లగా భారత్ రివ్యూ కోల్పోయింది. అయితే పెనాల్టీ కార్నర్‌ను గోల్ గా మలచడంలో జర్మనీ విఫలమైంది. శ్రీజేష్‌ను బురిడీ కొట్టించినప్పటికీ వెనకాలే ఉన్న సంజయ్ దాన్ని విజయవంతంగా అడ్డుకున్నాడు. అనంతరం మరికొద్ది సేపటికి రివ్యూ ద్వారా జర్మనీకి మరో పెనాల్టీ కార్నర్ దక్కగా ఈసారి గోల్ కీపర్ శ్రీజేష్ చాకచక్యంగా అడ్డుకున్నాడు.ఆట ముగిసేందుకు మరో ఆరు నిమిషాలుండగా జర్మనీ ఆటగాడు గోల్ వేశాడు.దీంతో జర్మనీ 3-2తో ముందంజలోకి దూసుకెళ్లింది. ఇక చివరి నిమిషంలో భారత్ దాడులు చేసినప్పటికీ ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. దీంతో భారత్ ఓటమి ఖాయమైంది. జర్మనీ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లగా భారత్ కాంస్యం కోసం స్పెయిన్‌తో తలపడనుంది.
మొత్తానికి అంపైర్ల నిర్ణయాలు మరోసారి వివాదాస్పదంగా మారాయి. క్వార్టర్ ఫైనల్స్‌లో ఏ రకంగా అయితే భారత్‌కు ప్రతికూల నిర్ణయాలు ఇచ్చారో.. సెమీస్‌లో కూడా అదే ధోరణి కనిపించినట్లు పలువురు హాకీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 12 పెనాల్టీ కార్నర్లు భారత్‌కు రాగా అందులో రెండిటిని మాత్రమే సద్వినియోగం చేసుకుంది.












Click it and Unblock the Notifications