Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఒలింపిక్స్‌లో ఎదురులేని భారత్: అతనే హీరో ..!!

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్.. మరో పతకానికి చేరువైంది. పురుషుల హాకీలో పతకం ముగింట్లో నిలిచింది. ఇంకొక్క విజయం సాధించగలిగితే పతకం ఖాయం. వీటితో పాటు మహిళల మిడిల్ వెయిట్ బాక్సింగ్, పురుషుల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో పతకాలను ముద్దాడే అవకాశం ఉంది.

తాజాగా.. పురుషుల హాకీ క్వార్టర్ ఫైనల్స్‌లో గ్రేట్ బ్రిటన్‌ను మట్టికరిపించింది భారత్. పెనాల్టీ షూటౌట్‌లో 4-2 గోల్స్ తేడాతో విజయకేతనాన్ని ఎగురవేసింది. హర్మన్‌ప్రీత్ సింగ్, సుఖ్‌జీత్, లలిత్, రాజ్‌కుమార్.. ఈ గోల్స్ సాధించారు. గ్రేట్ బ్రిటన్ రెండు గోల్స్‌కే పరిమితమైంది.

Paris Olympics 2024 India beat Great Britain in Men s Hockey quarterfinal

మ్యాచ్ ఆరంభంలో రెండు జట్లు కూడా పోటాపోటీగా ఆటతీరును ప్రదర్శించాయి. మ్యాచ్ ప్రారంభమైన 22వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్ సాధించాడు. దీనితో గ్రేట్ బ్రిటన్‌పై భారత్ 1-0 తేడాతో ఆధిక్యత సాధించింది. ఈ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. 27వ నిమిషంలో లీ మోర్టాన్ గోల్ సాధించాడు. దీనితో ఆధిక్యత 1-1 సమానమైంది.

60 నిమిషాల టైమ్ ముగిసేసరికి ఏ జట్టు కూడా మరో గోల్ సాధించలేకపోయాయి. దీనితో పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది గేమ్. పెనాల్టీ షూటౌట్‌లో గ్రేట్ బ్రిటన్ ప్లేయర్ జేమ్స్ ఆల్బ్రే తొలి గోల్ సాధించాడు. ఫలితంగా భారత్ 0-1 తేడాతో వెనుకపడింది. ఆ వెంటనే హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్ వేశాడు. స్కోర్ సమం అయింది.

రెండో రౌండ్‌లో జాక్ వాలెస్ మరో గోల్ సాధించడంతో బ్రిటన్ ఆధిక్యత 1-2కు పెరిగింది. ఆ తరువాతి రౌండ్‌లో సుఖ్‌జీత్ సింగ్ బంతిని గోల్ పోస్ట్‌లోకి నెట్టడంతో ఆధిక్యత 2-2గా సమమైంది. ఇక అక్కడి నుంచి భారత్‌కు ఎదురు లేకుండా పోయింది. ఆ తరువాత కానర్ విలియమ్సన్ సహా బ్రిటన్ ఆటగాళ్లెవరూ గోల్స్ వేయలేకపోయారు. గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ గోడ కట్టేశాడు.

అదే సమయంలో భారత్ వరుసగా గోల్స్ సాధించింది. హర్మన్‌ప్రీత్ సింగ్, సుఖ్‌జీత్ తరువాత స్టిక్ అందుకున్న లలిత్, రాజ్‌కుమార్ సైతం వరుసగా గోల్ సాధించడంలో విజయవంతం అయ్యారు. 4-2 తేడాతో విజయఢంకా మోగించారు. ఒలింపిక్స్‌లో హాకీలో భారత్ వరుసగా సెమీ ఫైనల్స్‌కు చేరడం 1972 మ్యూనిచ్ తరువాత ఇది రెండోసారి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+