భారత్‌ను డామినేట్ చేసిన పాకిస్తాన్: లెక్కలివీ..

India at Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024 ముగిశాయి. ఈ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్ ముగింపు వేడుకలు.. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:30 గంటలకు ఆరంభం అయ్యాయి. సుమారు మూడు గంటల పాటు కొనసాగనున్నాయి. అంగరంగ వైభవంగా ఈ సెలబ్రేషన్స్‌ను నిర్వహించింది ఒలింపిక్స్ కమిటీ.

117 మంది అథ్లెట్లు..

పారిస్ ఒలింపిక్స్‌లో మొత్తం 117 మంది భారత అథ్లెట్లు పాల్గొన్నారు. అర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, ఈక్వెస్ట్రియన్, గోల్ఫ్, హాకీ, జూడో, రోయింగ్, సెయిలింగ్, షూటింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, టెన్నిస్‌లతో సహా 16 ఈవెంట్లల్లో 69 పతకాల కోసం పోటీపడ్డారు.

Paris Olympics 2024 medals table USA at the top and India stands at 71 position with 6 Medals

అంచనాలు ఉన్నా..

ఈ ఒలింపిక్స్‌లో భారత్.. ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఆరు పతకాలకే పరిమితమైంది. 2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌తో పోల్చుకుంటే ఈ సంఖ్య తక్కువే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ ఏడు వేర్వేరు కేటగిరీల్లో విజయకేతనం ఎగురవేసింది. ఏడు పతకాలను సాధించింది. ఈ సంఖ్య ఇప్పుడు ఆరుకు దిగజారింది.

టోక్యోలో లెక్కలివీ..

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మొత్తం ఏడు పతకాలు లభించగా.. అందులో ఒక బంగారం, రెండు వెండి, నాలుగు రజతాలు ఉన్నాయి. 49 కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను- రజతం, మహిళల బాక్సింగ్ వాల్టర్‌వెయిట్‌‌లో లవ్లీనా బొర్గోహెయిన్- రజతం, బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు- రజతం, పురుషుల 57 కేజీల రెజ్లింగ్‌లో రవికుమార్ దహియా- రజతం, హాకీలో రజతం, పురుషుల 65 కేజీల రెజ్లింగ్‌లో బజరంగ్ పునియా- రజతం, జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా బంగారు పతకాలను సాధించారు.

పారిస్‌లో..

ఇప్పుడా పరిస్థితి లేదు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌ షూటింగ్‌లో మనుభాకర్- కాంస్యం, మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌ షూటింగ్‌లో మనుభాకర్- సరబ్జొత్ సింగ్ జోడీ కాంస్యం, పురుషుల 50 మీటర్ల రైఫిల్ షూటింగ్‌లో స్వప్నిల్ కుశాలె కాంస్యం, హాకీలో కాంస్యం, పురుషుల జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా రజతం, పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో అమన్ సెహ్రావత్ కాంస్య పతకాలను సాధించారు.

చతికిలపడ్డ స్టార్లు..

ఎన్నో అంచనాలను పారిస్‌కు మోసుకెళ్లిన పీవీ సింధు, లవ్లీనా బొర్గోహెయిన్ విఫలం అయ్యారు. జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ వస్తుందనే అంచనాలు సైతం తలకిందులయ్యాయి. స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. లక్ష్యసేన్, మీరాబాయి చాను, ధీరజ్ బొమ్మదేవర- అంకిత భకత్ జోడీపై ఎన్నో ఆశలు ఉన్నా అవి ఫలించలేదు.

నీరుగారిన హ్యాట్రిక్ ఆశలు..

పురుషుల డబుల్స్ బ్యాడ్మింటన్ సెమీఫైనల్స్‌లో పరాజయం పాలైన సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ షెట్టి జోడీ మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ పతకాన్ని కోల్పోయింది. పీవీ సింధు వరుసగా మూడు ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ పతకాలు సాధించడంలో విఫలమైంది. 2016 రియో డి జనేరియో, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ఆమె పతకాలు సాధించారు.

నిరాశపరిచిన నిఖత్..

అపారమైన అనుభవం ఉన్న వెటరన్ ఆర్చర్ దీపికా కుమారి విఫలం అయ్యారు. నాన్-ఒలింపిక్ ఈవెంట్లల్లో విజయాలు సాధించినప్పటికీ ఒలింపిక్స్‌లో రాణించలేకపోయారు. తెలంగాణ, అస్సాంకు చెందిన బాక్సర్లు నిఖత్ జరీన్, లవ్లీనా బోర్గోహైన్, ఈ దఫా పతకాలను అందుకోలేకపోయారు.

పతకాల పట్టికలో..

పతకాల పట్టికలో భారత్ 71వ స్థానంలో నిలిచింది. ఈ టేబుల్‌లో అమెరికా, చైనా, జపాన్ తొలి మూడు స్థానాలను ఆక్రమించాయి. పాకిస్తాన్ సైతం బోణీ కొట్టింది. ఆ దేశం స్థానం.. 62. సాధించింది ఒకే ఒక్క మెడల్ అయినప్పటికీ.. అది గోల్డ్ కావడం వల్ల భారత్ కంటే కొన్ని మెట్లు పైనే నిలిచింది. జావెలిన్ త్రోలో పాక్ అథ్లెట్ అర్షద్ నదీం బంగారు పతకాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+