ప్రధాని మోదీ 'గ్లో' సీక్రెట్ ఇదే?

PM Modi: భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిచి దేశమంతా ఉత్సవ వాతావరణాన్ని సృష్టించింది. మొట్టమొదటి ఐసీసీ మహిళ వన్డే వరల్డ్ కప్‌ను కైవసం చేసుకున్న తర్వాత జట్టుతో పాటు హెడ్ కోచ్ ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సంభాషణలు, అభినందనలు క్రీడా ప్రపంచంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

మోదీ 'గ్లో' రహస్యం ఏమిటి?
ఈ సమావేశంలో సరదా వాతావరణం నెలకొంది. దీనికి ప్రధాన కారణం టాపార్డర్ బ్యాటర్ హర్లీన్ డియోల్ అడిగిన ఒక చమత్కారమైన ప్రశ్న. ప్రధాని మోదీని ఉద్దేశించి.. "మీరు చాలా గ్లోతో కనిపిస్తారు. మీ స్కిన్‌కేర్ రొటీన్ ఏమిటి?" అని హర్లీన్ అడిగింది. ఈ ఊహించని ప్రశ్నకు గదిలో ఉన్నవారంతా గట్టిగా నవ్వుకున్నారు. ప్రధాని మోదీ ఈ ప్రశ్నకు తొలుత ఆశ్చర్యపోయి.. "నేను దీని గురించి అంతగా ఆలోచించలేదు," అని బదులిచ్చారు. అయితే వెంటనే ఆల్‌రౌండర్ స్నేహ్ రాణా జోక్యం చేసుకుని, "భారత ప్రజల ప్రేమ, ఆశీర్వాదాల వల్లే మీరు అలా కాంతివంతంగా కనిపిస్తారు" అని చెప్పగా.. ప్రధాని మోదీ భావోద్వేగంతో స్పందించారు.

PM Modi Glow Secret Fun Moment with Womens Cricket Team Goes Viral

ప్రధాని మోదీ సమాధానం
"అది నిజమే. భారత ప్రజల ప్రేమ నాకు అపారమైన బలానికి మూలం. నేను చాలా సంవత్సరాలు ప్రభుత్వంలో గడిపాను. ఇన్ని ఉన్నప్పటికీ, ప్రజల ఆశీర్వాదాలు వస్తూనే ఉంటాయి . అది చివరికి మీపై ప్రభావం చూపుతుంది." అని ప్రధాని మోదీ అన్నారు.

భారత మహిళల క్రికెట్‌లో చారిత్రక ఘట్టం
భారత మహిళల జట్టు తమ మొట్టమొదటి ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకోవడం ఈ సమావేశానికి ప్రధాన నేపథ్యం. నవీ ముంబైలో జరిగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి వన్డే టైటిల్‌ను గెలుచుకున్న నాలుగో జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. ఇది సంవత్సరాల కృషికి తృటిలో తప్పిపోయిన అనేక విజయాలకు అందిన విముక్తిగా క్రీడా విశ్లేషకులు అభివర్ణించారు.

కౌర్ పట్టుదల: ట్రోఫీతో మళ్లీ వచ్చాం!
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రధాని మోదీతో తమ పాత జ్ఞాపకాలను పంచుకున్నారు.
2017 జ్ఞాపకం: "2017లో మేము మిమ్మల్ని కలిసినప్పుడు నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ సమయంలో, మేము ట్రోఫీతో రాలేదు. కానీ ఈసారి మేము ఇన్నేళ్లుగా తీవ్రంగా కృషి చేస్తున్న దాన్ని ట్రోఫీ రూపంలో ఇక్కడికి తీసుకురావడం మాకు చాలా గౌరవంగా ఉంది. భవిష్యత్తులో మేము మిమ్మల్ని మళ్లీ మళ్లీ కలుస్తూ.. మీతో మీ జట్టుతో పదేపదే ఫోటోలు దిగాలని లక్ష్యంగా పెట్టుకున్నాము." అని హర్మన్‌ప్రీత్ కౌర్ పేర్కొన్నారు.

క్రికెట్‌పై ప్రధాని మోదీ వ్యాఖ్యలు
కౌర్ వ్యాఖ్యలకు బదులిస్తూ ప్రధాని మోదీ క్రికెట్ ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. "మీరు గొప్ప పని చేశారు. భారతదేశంలో క్రికెట్ కేవలం ఒక ఆట మాత్రమే కాదు. ఒక విధంగా ఇది భారత ప్రజల జీవితంగా మారింది. క్రికెట్‌లో మంచి జరిగితే, భారతదేశం సంతోషంగా ఉంటుంది. క్రికెట్‌లో కొంచెం తప్పు జరిగినా.. భారత్ మొత్తం బాధపడుతుంది," అని ప్రధాని అన్నారు. చివరిగా ప్రధాన మంత్రి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' దీప్తి శర్మ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆమె హనుమాన్ టాటూ గురించి కూడా అడిగి తెలుసుకోవడం సమావేశంలోని మరో ఆసక్తికర అంశం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+