జుట్టు అలా పెంచావ్..పుష్ప 3లో గానీ యాక్ట్ చేస్తావేంట్రా..!!

Pushpa 2 the Rule: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం.. పుష్ప 2 ద రూల్. 2021లో ఇండస్ట్రీ హిట్ కొట్టిన పుష్పకు ఇది సీక్వెల్. డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోందీ మూవీ. ఈ సాయంత్రం బిహార్ రాజధాని పాట్నాలో ట్రైలర్ లాంచ్ కాబోతోంది.

500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీకి సుకుమార్ దర్శకుడు. అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్, జగదష్ ప్రతాప్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, రావు రమేష్, అజయ్ ఘోష్, ధనంజయ.. ఇలా పుష్పలో నటించిన స్టార్ క్యాస్ట్ అంతా ఇందులోనూ కంటిన్యూ అయింది. శ్రీలీల ఓ ఐటమ్ సాంగ్‌లో మెరుపులు మెరిపించనుంది.

Pushpa 2 the rule Suryakumar Yadav talked to Tilak Varma about his hair wanted to work in Pushpa 3

ఈ సాయంత్రం ట్రైలర్ రిలీజ్ కాబోతోన్న నేపథ్యంలో పుష్ప 2 మేనియా అలముకుంది దేశవ్యాప్తంగా. పాన్ ఇండియాగా విడుదల కానుండటంతో నార్త్‌లో కూడా హైప్ క్రియేట్ అయింది. మరోసారి 1,000 కోట్ల రూపాయల కలెక్షన్లను తెలుగు సినిమా అందుకుంటుందనే అంచనాలు ఉన్నాయి.

పుష్ప 2 మేనియా ఎంతలా ఉందంటే- టీమిండియా టీ20 ఫార్మట్ కేప్టెన్ సూర్యకుమార్ యాదవ్- హైదరాబాద్‌కు చెందిన డాషింగ్ బ్యాటర్ తిలక్ వర్మ ఛిట్ ఛాట్‌లోనూ దీని ప్రస్తావన వచ్చింది. ఈ మధ్యకాలంలో ఒత్తైన జుట్టుతో కనిపిస్తోన్నాడు తిలక్. అదే ఈ టాపిక్‌కు కేంద్రబిందువు అయింది.

జుట్టు ఒత్తుగా పెంచడంపై తిలక్ వర్మను ప్రశ్నించాడు సూర్యకుమార్ యాదవ్. దీని వెనుక కారణం ఏమిటంటూ గుచ్చి గుచ్చి అడిగాడు. హెయిర్ స్టైల్ చూసి అందరూ అల్లు అర్జున్.. అంటూ పిలుస్తున్నారని, పుష్ప 3లో గానీ యాక్ట్ చేయాలనుకుంటున్నావా? అని అడగ్గా- దీనికి నవ్వుతూ బదులిచ్చాడు తిలక్. బ్యాట్, బాల్.. గ్రౌండ్.. ప్రస్తుతం తన మైండ్‌లో ఇవే ఉన్నాయని చెప్పాడు.

జట్టు ఒత్తుగా పెంచడం తనకు ఇష్టమని, గ్రౌండ్‌లో మ్యాచ్ ఆడేటప్పుడు ఇలా కనిపించాలనుకోవడం తన డ్రీమ్‌ అని అన్నాడు. హెల్మెట్ తీసినప్పుడు జట్టు అలా గాలికి ఎగురుతుంటే చూడ్డానికి భలే ఉంటుందని చెప్పుకొచ్చాడు.

దక్షిణాఫ్రికాపై జరిగిన నాలుగో వన్డేలో తిలక్ వర్మ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. 47 బంతుల్లో 120 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడీ లెఫ్ హ్యాండ్ బ్యాటర్. అదే మ్యాచ్‌లో ఓపెనర్, వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ కూడా సెంచరీ బాదాడు 109 పరుగులు చేశాడు. నిర్ణీత 20 ఓవర్లల్లో ఒక వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది భారత్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+