వాల్‌మార్ట్ చేతికి రాజస్థాన్ రాయల్స్: రూ.15,300 కోట్లు, సింగిల్ పేమెంట్: ఎవరీ సొమానీ?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ దగ్గరికొచ్చింది. ఈ నెల 28న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మధ్య జరుగనుంది. ఈ ఐపీఎల్ ఓపెనర్ కు బెంగళూరు ఎం చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. ప్రస్తుతం 10 జట్లు తమ సన్నాహకాల్లో నిమగ్నం అయ్యాయి. ప్లేయర్లందరూ తమ జట్లతో కలుస్తున్నారు. ముమ్మరంగా ప్రాక్టీస్ సాగిస్తోన్నారు.

ఈ పరిణామాల మధ్య రాజస్థాన్ రాయల్స్ చేతులు మారింది. కల్ సోమానీ నేతృత్వంలోని ఓ కన్సార్టియం ఈ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. 100 శాతం స్టేక్స్ ను తీసుకుంది. అమెరికాకు చెందిన వ్యాపారవేత్త కల్ సోమానీ.. సారథ్యంలోని కన్సార్టియం ఇది. మొత్తం 1.63 బిలియనన్ డాలర్లు పెట్టిన ఈ జట్టును సొంతం చేసుకుంది. మనదేశ కరెన్సీలో దీని విలువ సుమారు 15,300 కోట్ల రూపాయలు. ఈ మొత్తాన్ని సింగిల్ పేమెంట్ గా చెల్లిస్తుంది. ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద డీల్‌.

Rajasthan Royals Taken Over by Kal Somani-Backed Group with Rob Walton of Walmart Deal

వాల్‌మార్ట్ కుటుంబానికి చెందిన ప్రముఖ అమెరికన్ వ్యాపారవేత్త రాబ్ వాల్టన్, అలాగే హాంప్ కుటుంబం, కల్ సోమానీ కలిసి ఈ కన్సార్టియంను ఏర్పాటు చేశారు. ప్రస్తుత సీజన్ ముగిసిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ టీమ్.. వీరి చేతుల్లోకి వెళ్లిపోతుంది. అంతకుముందు సీవీసీ కన్సార్టియం క్యాపిటల్ పార్ట్‌నర్స్‌ నుండి టోరెంట్ గ్రూప్ గుజరాత్ టైటాన్స్‌లో 67 శాతం వాటాను 5,025 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. మిగిలిన వాటాను సీవీసీ క్యాపిటల్ నిలుపుకుంది.

రాజస్థాన్ రాయల్స్ 65 శాతం స్టేక్స్ ఎమర్జింగ్ మీడియా వెంచర్స్ కు చెందిన మనోజ్ బదాలే ఆధీనంలో ఉండేది. మిగిలిన 35 శాతాన్ని రెడ్‌బర్డ్ క్యాపిటల్ పార్ట్‌నర్స్, లాచ్‌లాన్ మర్డోక్ పంచుకున్నాయి. ఈ వాటా విక్రయ ప్రక్రియ గత ఏడాది చివరలో మొదలైంది. ది రెయిన్ గ్రూప్ పెట్టుబడి బ్యాంక్ సలహాదారుగా వ్యవహరించింది. ఆదిత్య బిర్లా గ్రూప్ వంటి ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపగా, సోమానీ కన్సార్టియం కొనుగోలుకు ముందంజలో ఉన్నట్లు మనీకంట్రోల్ అప్పట్లో వెల్లడించింది

అరిజోనాకు చెందిన ఓ సీరియల్ ఎంటర్‌ప్రెన్యూర్ కల్ సొమానీ. ఎడ్యుటెక్, డేటా సీక్రెసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడ్మినిస్ట్రేషన్, స్పోర్ట్స్ టెక్ రంగాలలో 15 సంవత్సరాలకు పైగా అనుభవం ఉందాయనకు. టెక్ సర్వీసులు అందించే ఇంట్రాఎడ్జ్, ట్రూయో వంటి అనేక వెంచర్లకు ఆయనే వ్యవస్థాపకుడు. ఏఐ అడ్మిన్ కార్యకలాపాల్లో ఆయనకు అనుభవం ఉంది. మోటార్ సిటీ గోల్ఫ్ క్లబ్‌కు కోఓనర్ గా వ్యవహరిస్తోన్నారు. టీఎంఆర్ డబ్ల్యూ స్పోర్ట్స్, టీజీఎల్ గోల్ఫ్ లీగ్ వంటి వెంచర్లలో ప్రారంభ పెట్టుబడిదారుగా సోమానీ కొనసాగుతున్నారు. 2021లో రాయల్స్ తొలిసారి పెట్టుబడి పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+