ఐపీఎల్ షెడ్యూల్ మార్పు - ఛాంపియన్స్ ట్రోఫీ తుది జట్టు..!!

ఐపీఎల్ సమరానికి సర్వం సిద్దమవుతోంది. ఇందుకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఈ నెల 22 నుంచి ఇంగ్లాండ్ టూర్.. ఆ తరువాత ఛాంపియన్స్ ట్రోఫీ.. ఇక, ఐపీఎల్ నిర్వహించేలా తొలుత షెడ్యూల్ ఖరారైంది. ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా కూర్పు పైన కసరత్తు కొనసాగుతోంది. ఇక, ఇదే సమయంలో ముందుగా నిర్ణయించిన ఐపీఎల్ -2025 షెడ్యూల్ లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్త షెడ్యూల్ పైన క్లారిటీ ఇచ్చారు.

తాజా నిర్ణయం మేరకు
ఐపీఎల్ 2025 కు సంబంధించి బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. సీజన్ మార్చి 23 నుంచి ప్రారంభం కానుందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. సుమారు 65 రోజుల పాటు సాగనున్న ఈ టోర్నీలో మే 25న ఫైనల్‌ మ్యాచ్ ఉంటుందని తెలిపారు. బీసీసీఐ ప్రత్యేక సాధారణ సమావేశం ఆదివారం ముంబయిలో జరిగింది. తొలుత ఈ సీజన్ మార్చి 14న ప్రారంభం అయ్యేలా ప్లాన్ చేసారు. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ..బీహార్ ఎన్నికలు.. భద్రత అంశాలను పరిగణలోకి తీసుకొని షెడ్యూల్ లో మార్పులు చేసారు. కాగా, అధికారికంగా మ్యాచ్ ల వారీగా షెడ్యూల్ ను ఫైనల్ చేయాల్సి ఉంది.

Rajeev Shukla confirms IPL 2025 to start from March 23 details here

భారీ అంచనాలు
ఈ నెల చివరి వారంలో అధికారికంగా మ్యాచ్ లు.. వేదికలతో సహా షెడ్యూల్ ప్రకటించేలా కసరత్తు కొనసాగుతోంది. ఆదివారం జరిగిన బీసీసీఐ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తాజాగా జరిగిన ఐపీఎల్ వేలంలో అన్ని జట్ల కూర్పు పూర్తయింది. అధికంగా లక్నో సూపర్ జెయింట్స్ రికార్డు ధరతో పంత్ ను సొంతం చేసుకుంది. పంత్ కోసం ఏకంగా రూ 27 కోట్లు ఖర్చు చేసింది. ఆ తరువాత శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో, కీలక ఆటగాళ్లు టీంలు మారటంతో ఈ సారి ఐపీఎల్ పైన భారీ అంచనాలు ఉన్నాయి, ఇక.. సీఎస్కే - ఆర్సీబీ మధ్య చెన్నైలో జరిగే మ్యాచ్ తో ఐపీఎల్ ప్రారంభం కానుంది.

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం
ఇదే సమయంలో ఛాంపియన్స్ ట్రోఫీ టీం కూర్పు పైన కసరత్తు కొనసాగుతోంది. తుది జట్టు ఎంపిక కోసం ఈ నెల 18, 19 తేదీల్లో కీలక సమావేశం జరగనుంది. ఈ నెల 12వ తేదీ వరకు ఐసీసీ జట్టు ఎంపికకు గడవు విధించింది. కానీ, భారత్ జట్టు ఎంపికలో జాప్యం జరుగుతోంది. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. 20న దుబాయ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగే గ్రూప్ దశ మ్యాచ్‌తో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ ఆటను ప్రారంభించనుంది. మార్చి 23న టీమిండియా పాకిస్థాన్ తో.. మార్చి 2న న్యూజీలాండ్ తో తలపడనుంది. టీమిండియా ఆడే మ్యాచ్ లు దుబాయ్ కేంద్రంగా జరగనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+