గంభీర్ ఎంట్రీ.. రవీంద్ర జడేజా కెరీర్ క్లోజ్

టీమిండియా ఆటగాళ్లలో రవీంద్ర జడేజా కీలక ఆటగాడని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు.రవీంద్ర జడేజా పేరు చెప్పగానే మొట్టమొదటిగా గుర్తుకు వచ్చేది అతని ఫీల్డింగ్. తనదైన ఫీల్డింగ్‌తో జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. అలాంటి ఆటగాడి కెరీర్ ముగిసిపోయినట్టే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో జడేజా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. బంతితో పాటు, బ్యాట్‌తో కూడా రాణించలేకపోయాడు. అయితే జట్టుకు వరుస విజయాలు రావడంతో జడేజా ఫెయిల్యూర్ పెద్దదిగా కనిపించలేదు.

టీ20 వరల్డ్ కప్ గెలవడంతో కోహ్లీ, రోహిత్‌లు టీ20ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. తన రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయని భావించిన జడేజా, టీ20ల నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు. వన్డేలు, టెస్టుల్లో కొనసాగుతాను అన్నాడు. అయితే ఏం జరిగిందో తెలియదు కాని, బీసీసీఐ జడేజాను పక్కన పెట్టేసింది. శ్రీలంకతో వన్డే సిరీస్‌కు జడేజాను పూర్తిగా పక్కనపెట్టేసింది.

Ravindra Jadeja Unlikely To Play ODIs For Indian team Again

కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ సైతం టీ20 వరల్డ్‌ కప్‌ 2026, వన్డే వరల్డ్‌ కప్‌ 2027ను టార్గెట్‌గా పెట్టుకొని కొత్త టీమ్‌ను ఎంపిక చేసుకుంటున్నాడు. టీమ్‌కు భారమైన ఆటగాళ్లను పక్కనపెట్టేయాలని బీసీసీఐకి గట్టి సూచన చేసినట్లు సమాచారం. దీనిలో భాగంగానే జడేజాను శ్రీలంక టూర్‌కు ఎంపిక చేయలేదని తెలుస్తోంది. యువ ఆల్‌రౌండర్లు అక్షర్‌ పటేల్‌, శివమ్‌ దూబే అద్భుతంగా రాణిస్తుండటంతో ఇకపై టీమిండియాలో జడేజా కనిపించే అవకాశాలు లేవని క్రికెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

దీంతో రవీంద్ర జడేజాను వన్డేలకు సైతం పూర్తిగా పక్కనపెట్టేసినట్లు తెలుస్తోంది. ఇక జడేజా కేవలం టెస్టులకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి గంభీర్ ఎంట్రీతో రవీంద్ర జడేజా ప్లేస్‌కు ఎసరొచ్చింది. ఈ లెక్కన చూసుకుంటే భారత క్రికెట్‌లో రవీంద్ర జడేజా శకం ముగినినట్టే కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+