నక్కతోక తొక్కిన రవీంద్ర జడేజా భార్య- మంత్రిగా ప్రమాణ స్వీకారం

Rivaba Jadeja: భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న గుజరాత్ లో మంత్రివర్గ విస్తరణ చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కేబినెట్ లో భారీ మార్పులు చేర్పులు చోట జరిగాయి. ఏకంగా 18 మందిని కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకోవడం అంటే మాటలు కాదు. కొద్దిసేపటి కిందటే కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో ఈ కార్యక్రమం ఏర్పాటైంది. గవర్నర్ ఆచార్య దేవ్ దత్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో కొత్త మంత్రివర్గం కొలువుదీరినట్టయిందక్కడ.

ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సమక్షంలో పాతవారితో కలిపి మొత్తం 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. హోం శాఖ మంత్రి హర్ష్ సంఘ్వీకి పదోన్నతి లభించింది. ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇదే హోదాలో హోం మంత్రిత్వ శాఖను పర్యవేక్షిస్తారు. దీంతో పాటు హర్ష్ సంఘ్వీకి మరిన్ని శాఖలు కూడా బదలాయించే అవకాశాలు లేకపోలేదు. కొత్త మంత్రులకు పోర్ట్ ఫోలియోలను కేటాయిస్తూ ఇంకాస్సేపట్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి.

Ravindra Jadeja s wife Joins Gujarat Cabinet as One of 25 New faces

కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఈ 25 మందిలో ప్రముఖ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా ఉన్నారు. జామ్ నగర్ నార్త్ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి, ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 53 వేలకు పైగా ఓట్ల తేడాతో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కర్సన్ భాయ్ కర్మూర్ ను ఓడించారామె. ఇక్కడ కాంగ్రెస్ మూడో స్థానంలో నిలిచింది.

కొత్తగా మంత్రివర్గంలో చేరిన వారిలో అర్జున్‌భాయ్ దేవభాయ్ మోద్వాడియా- పోర్‌బందర్,

రివాబా జడేజా- జామ్‌నగర్ నార్త్

కాంతిలాల్ శివాలాల్ అమృతీయ- మోర్బీ,

దర్శన ఎం వాఘేలా- అసర్వా

ప్రద్యుమాన్ వాజా- కోడినార్,

కౌషిక్ కాంతిభాయ్ వెకారియా- అమ్రేలి,

స్వరూప్‌జీ సర్దార్జీ ఠాకూర్- వావ్

త్రికమ్ బైజల్ చంగా-అంజర్

నరేష్‌భాయ్ మగన్‌భాయ్ పటేల్- గణదేవి

డాక్టర్ జయరాంభాయ్ చెమాభాయ్ గామిత్- నిజార్

పీసీ బరందా- భిలోదా,

రమేష్‌భాయ్ భురాభాయ్ కతారా- ఫతేపురా,

ఈశ్వర్‌సింగ్ ఠాకూర్‌భాయ్ పటేల్- అంక్లేశ్వర్

మనీషా రాజీవ్‌భాయ్ వకీల్- వడోదర సిటీ

ప్రవీణ్ మాలి- దీసా

కమలేష్‌భాయ్ రమేష్‌భాయ్ పటేల్- పేట్లాడ్

సంజయ్‌సింగ్ రాజయ్‌సింగ్ మహీద- మహుధా

జితేంద్రభాయ్ సావ్‌జీభాయ్ వాఘాని- భావ్‌ నగర్ వెస్ట్ ప్రమాణం చేశారు.

పాత మంత్రుల్లో..

భూపేంద్ర పటేల్- ఘట్లోడియా (ముఖ్యమంత్రి )

రిషికేష్ గణేష్‌భాయ్ పటేల్- విస్‌నగర్

కున్వర్‌జీ భాయ్ మోహన్‌భాయ్ బావాలియా- జస్దాన్

ప్రఫుల్ పన్సేరియా- కమ్రెజ్,

హర్ష్ సంఘ్వీ- మజురా (ఉప ముఖ్యమంత్రి)

పర్షోత్తంభాయ్ సోలంకి- భావ్‌నగర్ రూరల్

కను మోహన్‌లాల్ దేశాయ్- పార్డీ.. ఉన్నారు.

కొత్త మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో పాటు పటిదార్లు-7, ఓబీసీ-8, ఎస్సీ- 3, ఎస్టీ- 4 ఉన్నారు. రివాబా జడేజాతో పాటు దర్శన వాఘేలా, మనీషా వకీల్ కు మహిళల కోటాలో మంత్రివర్గంలో చోటు లభించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+