ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే RCBదే కప్పు, నాడు సరిగ్గా ఇలాగే..!!
IPL 2026 కీలక దశకు చేరింది. ప్లే ఆఫ్స్ కోసం ప్రస్తుతం పోటీ పెరిగింది. ముంబాయి ఇండియన్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. తాజాగా ముంబాయిని ఓడించిన బెంగళూరు ప్లే ఆఫ్స్ కు మరింత చేరువ అయింది. అటు సన్ రైజర్స్ పాయింట్ల పట్టికలో ఆర్సీబీ, గుజరాత్ తో సమానంగా ఉంది. లీగ్ చివరి దశకు చేరటంతో.. ప్రతీ మ్యాచ్ టేబుల్ లో ముందు వరుసలో ఉన్న జట్లకు కీలకంగా మారుతోంది. కాగా.. తాజా మ్యాచ్ లో 2016 హిస్టరీ రిపీట్ అయింది. ఇదే కొనసాగితే ఆర్సీబీ తిరిగి చాంపియన్ కావటం ఖాయంగా కనిపిస్తోంది.
ఐపీఎల్ లో ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారుతోంది. ఇప్పుడు తాజాగా ఆర్సీబీ వర్సస్ ముంబాయి మ్యాచ్ లో చోటు చేసుకున్న కొన్ని ఆసక్తి కర పరిణామాలు తిరిగి ఆర్సీబీ చాంపియన్ గా గెలిచే అవకాశం ఉందనే చర్చకు కారణంగా నిలుస్తున్నాయి. సరిగ్గా పదేళ్ల క్రితం నాటి పరిణామాలే ఇప్పుడు రిపీట్ అవుతున్నాయి. ముంబాయి - ఆర్సీబీ మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగింది. చివరి ఓవర్ లో ఆర్‌సీబీ స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ బ్యాట్‌తో మెరిసి ఒక సిక్సర్ బాదాడు. ఈ ఒక్క సిక్సర్ వెనుక 10 ఏళ్ల నాటి ఒక స్ట్రాంగ్ సెంటిమెంట్ దాగి ఉంది. అదే ఇప్పుడు ఈ చర్చకు కారణంగా మారింది. 2016 లో భువనేశ్వర్ సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడారు. ఆ సీజన్ లో భువనేశ్వర్ బాదిన ఒక సిక్సర్.. అదే సమయంలో అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ కూడా గెలుచుకున్న విషయాన్ని ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. ఫలితంగా ఆ సీజన్‌లో ఆయన ఉన్న జట్టు (SRH) టైటిల్ కొట్టింది.

ప్లే ఆఫ్స్ కోసం రేసు.. మారుతున్న లెక్కలు
ఇప్పుడు సరిగ్గా 10 ఏళ్ల తర్వాత 2026లో మళ్ళీ అదే సీన్ కనిపిస్తోంది. ముంబై ఇండియన్స్‌పై భువీ కొట్టిన సిక్సర్ మ్యాచ్ ను గెలపించింది. నాటి జ్ఞాపకాలను గుర్తుచేసింది. ప్రస్తుత సీజన్ లో భువీ పర్పుల్ క్యాప్ రేసులో భువనేశ్వర్ కుమార్ 11 మ్యాచ్‌లలో 21 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 2016లో కూడా ఆయన పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నప్పుడే ఆయన జట్టు విజేతగా నిలిచింది. ఇప్పుడు కూడా భువీ పర్పుల్ క్యాప్‌తో ఉండటం, సిక్సర్ బాదడం.. ఈ రెండు యాధృచ్ఛికాలు ఆర్‌సీబీ వరుసగా రెండో టైటిల్‌ను ముద్దాడబోతోందనే సంకేతాలను ఇస్తున్నాయి. అదే విధంగా తాజా గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో టాప్ కు చేరింది. భువనేశ్వర్ కుమార్ ఫామ్‌లో ఉండటం, దానికి తోడు ఈ 10 ఏళ్ల సెంటిమెంట్ తోడవ్వడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఒకవేళ ఆర్‌సీబీ ఈ ఏడాది కూడా ట్రోఫీ నెగ్గితే, ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండుసార్లు టైటిల్ గెలిచిన జట్ల జాబితాలో చేరుతుంది. దీంతో.. భూవి సెంటిమెంట్ ఈ సారి రిపీట్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి.













Click it and Unblock the Notifications