ఆర్సీబీ ఫర్ సేల్?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఫ్రాంచైజీ భవిష్యత్తుపై ప్రస్తుతం ఊహాగానాలు జోరందుకున్నాయి. 2025లో తొలిసారిగా ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్న ఈ జట్టు ఆ వెంటనే ఓ విషాద సంఘటనను ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఫ్రాంచైజీ అమ్మకానికి సిద్ధంగా ఉందని మాజీ ఐపీఎల్ చీఫ్ లలిత్ మోదీ ధ్రువీకరించారు.
ఐపీఎల్ యాజమాన్యం నిర్ణయం ఇదే..
ప్రస్తుత ఆర్సీబీ యాజమాన్యం డియాజియో పీఎల్‌సీ (Diageo Plc) ఈ ఫ్రాంచైజీని విక్రయించాలని నిర్ణయించుకున్నట్లు లలిత్ మోడీ వెల్లడించారు. తన అధికారిక 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) ఖాతాలో ఆయన ఈ విషయం గురించి ఒక వివరణాత్మక పోస్ట్ చేశారు. లలిత్ మోడీ తన ఎక్స్ పోస్టులో.. "చివరకు యజమానులు దీన్ని తమ బ్యాలెన్స్ షీట్ నుంచి తొలగించి, అమ్మేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గత సీజన్‌లో ఐపీఎల్ గెలిచినందున, బలమైన అభిమాన గణం, అద్భుతమైన నిర్వహణ బృందం ఉన్నందున, ఇది మొత్తం ఐపీఎల్ ఫ్రాంచైజీగా అమ్మకానికి అందుబాటులో ఉన్న ఏకైక జట్టు కావచ్చు." అని అన్నారు.

కొత్త రికార్డు ధర ఖాయం!
ఆర్సీబీ విక్రయం గురించి లలిత్ మోడీ గ్లోబల్ ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించే అంశాలను కూడా హైలైట్ చేశారు:
"పెద్ద గ్లోబల్ ఫండ్స్ లేదా సావరిన్ ఫండ్స్‌లలో ఏదో ఒకటి దీన్ని తమ ఇన్వెస్ట్‌మెంట్, ఇండియా స్ట్రాటజీలో భాగంగా చేసుకోవాలని తీవ్రంగా కోరుకోవచ్చు. దీని కంటే మెరుగైన పెట్టుబడి అవకాశం మరొకటి ఉండదు."ఈ ఫ్రాంచైజీ ఖచ్చితంగా కొత్త రికార్డు వాల్యుయేషన్‌ను సృష్టిస్తుంది. ఐపీఎల్ అనేది ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న లీగ్ మాత్రమే కాదు, అత్యంత విలువైన లీగ్ అని ఇది నిరూపిస్తుంది. ఆర్సీబీ నిర్ణయించే ఆ కొత్త ధర అన్ని జట్లకు కొత్త రికార్డు ధర అవుతుంది." అని లలిత్ మోడీ పేర్కొన్నారు.
There have been a lot of rumour about the sale of an @IPL franchise specifically @RCBTweets - well in the past they have been denied. But it seems the owners have finally decided to take it off their balance sheet and sell it. I am sure having won the IPL last season and also… pic.twitter.com/ecXfU5n5v5
— Lalit Kumar Modi (@LalitKModi) September 29, 2025
గతంలో కూడా ఆర్సీబీ అమ్మకానికి ఉన్నట్లు వార్తలు వచ్చాయి. డియాజియో కొనుగోలుదారులతో చర్చలు జరుపుతోందని మీడియా సంస్థలు అప్పట్లో నివేదించాయి. ఇప్పుడు లలిత్ మోడీ ఈ విషయాన్ని ధృవీకరించడంతో, అత్యంత ప్రజాదరణ పొందిన, సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీలలో ఒకటైన ఆర్సీబీని ఎవరు సొంతం చేసుకుంటారో తెలుసుకోవడానికి ఐపీఎల్ ప్రపంచం ఎదురుచూస్తోంది.












Click it and Unblock the Notifications