స్టార్ ఫినిషర్ నీ అంకితభావానికి సెల్యూట్!

టీమిండియా యువ ఆటగాడు, స్టార్ ఫినిషర్ రింకూ సింగ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. రింకూ సింగ్ తండ్రి ఖాన్‌చంద్ సింగ్(63) అనారోగ్యంతో కన్నుమూశారు. అయితే తన తండ్రికి అతిమ సంస్కారాలు నిర్వహించిన వెంటనే రింకూ సింగ్ తిరిగి టీమిండియా క్యాంపులో చేరడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేయడమే కాకుండా.. దేశం పట్ల రింకూకు ఉన్న అంకితభావాన్ని చాటిచెబుతోంది.

వ్యాధిపై పోరాడుతూ తుదిశ్వాస
ఖాన్‌చంద్ సింగ్ గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఫిబ్రవరి 21న ఆయన్ను గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ ఆసుపత్రిలో చేర్పించారు. కృత్రిమ శ్వాస ద్వారాచికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలియగానే రింకూ కుటుంబంలోనే కాకుండా క్రికెట్ వర్గాల్లోనూ విషాదం అలుముకుంది. రింకూ తన తండ్రికి కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా రింకూ సింగ్ సతీమణి ప్రియా సరోజ్ సోషల్ మీడియాలో రాసిన ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Rinku Singh Joins Team India Post Father Demise Heartbreaking News and Commitment to IND vs WI

కష్టకాలంలోనూ జట్టు వెంటే..
తండ్రి ఆరోగ్యం క్షీణించిన సమయంలో కూడా రింకూ సింగ్ కొద్దిరోజులు ఇంటి దగ్గర ఉండి, భారత్-జింబాబ్వే మ్యాచ్‌కు ముందు తిరిగి చెన్నైలోని టీమిండియా క్యాంప్‌కు చేరుకున్నారు. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఆ మ్యాచ్‌లో రింకూ ప్లేయింగ్ ఎలెవన్‌లో లేకపోయినా, డ్రెస్సింగ్ రూమ్‌లో తన సహచరులతో కలిసే ఉన్నారు. ఆ మ్యాచ్‌లో రింకూ స్థానంలో సంజూ శాంసన్‌కు అవకాశం దక్కగా.. సంజూ అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాడు.

వెస్టిండీస్‌తో కీలక మ్యాచ్‌కు సిద్ధం
వ్యక్తిగత విషాదాన్ని పక్కన పెట్టి, వెస్టిండీస్‌తో జరగబోయే అత్యంత కీలకమైన మ్యాచ్ కోసం రింకూ సింగ్ మళ్లీ జట్టుతో చేరడం ఆయన నిబద్ధతను తెలియజేస్తోంది. టీమ్ యాజమాన్యం, ఆటగాళ్లందరూ రింకూ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వెస్టిండీస్‌తో జరిగే ఈ 'డూ ఆర్ డై' మ్యాచ్‌లో రింకూ సింగ్ మెరుపులు మెరిపిస్తారని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+