Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL 2025: పంత్ కోసం ఆ టీం ఎంతకైనా రెడీ - ఆ ఇద్దరు కెప్టెన్లు మార్పు..!!

IPL Auction 2025: ఐపీఎల్ మెగా వేలం కు సర్వం సిద్దమైంది. మార్చి 14 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ లో ఈ సారి యువ సంచలనాల మెరుపులు కనిపించటం ఖాయంగా కనిపిస్తోంది. ఫ్రాంచైజీలు తమ రిటైనింగ్ ప్లేయర్ల పైన ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. యువ ఆటగాళ్ల కోసం భారీ కేటాయింపులతో సై అంటున్నారు. ఈ సారి పంత్ కు భారీ డిమాండ్ కనిపిస్తోంది. ఇప్పటికే ప్రధాన జట్ట పంత్ కోసం ఎంతకనా సిద్దం అంటోంది. ఇక, కెప్టెన్ల మార్పు అనివార్యంగా కనిపిస్తోంది.

పంత్ దక్కేదెవరికి
రెండు రోజుల పాటు జరిగే ఐపీఎల్ వేలం ఈ సారి సంథింగ్ స్పెషల్ గా నిలవనుంది. మొత్తం 10 ప్రాంఛైజీలు 577 మంది ఆటగాళ్ల కోసం పోటీ పడుతున్నాయి. వీరిలో 367 మంది భారత్ నుంచి ఆటగాళ్ల ఉండగా.. 210 మంది విదేశీ ప్లేయర్స్ ఉన్నారు. ఈ సారి ఎవరికి రికార్డు ధర పలుకుతుం దనేది ఆసక్తిని పెంచుతోంది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి...కోలుకొని గ్రౌండ్ లో అటు కీపింగ్.. ఇటు బ్యాటింగ్ లో చెలరేగుతున్న రిషబ్ పంత్ కోసం పోటీ పెద్ద ఎత్తున కనిపిస్తోంది. డిల్లీ క్యాపిటల్స్ తిరిగి పంత్ కోసం ప్రయత్నిస్తున్నా...రిషబ్ ఆసక్తిగా లేడని తెలుస్తోంది. దీంతో, రైటు టు మ్యాచ్ ను ప్రయోగించే అవకాశం ఉంది.

ఐపీల్ వేలం 2025 LIVE: కాసుల వర్షం ఎవరిపై కురుస్తుంది..?

Rishabh Pant will now be the most sought-after player during the IPL mega auction

సిద్దమైన ఆ రెండు జట్లు
పంత్ ఈ సారి ఆక్షన్ లో రికార్డు ధర పలికిన ఆటగాడిగా నిలుస్తారని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అన్ని టీం ల నుంచి పంత్ వైపు ఆసక్తి ఉన్నా..నిధుల పరిమితి ప్రతికూలంగా మారుతోంది. దీంతో, పంజాబ్ కింగ్స్ తో పాటుగా ఆర్సీబీ పంత్ కోసం పోటీ పడతాయనే అంచనా లు వ్యక్తం అవుతున్నాయి. పంజాబ్ కింగ్స్ మంచి కెప్టెన్ కోసం అన్వేషిస్తోంది. పంత్ కోసం ఆర్సీబీ భారీగా వెచ్చించేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ సారి కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, అర్ష దీప్ సింగ్ పైనా ఫ్రాంచైజీల ఆలోచనల పై చర్చ జరుగుతోంది. ఢిల్లీ కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్, అదే విధంగా కోల్ కతా కెప్టెన్ గా కేఎల్ రాహుల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో అయ్యర కోల్ కతా, రాహుల్ లక్నోకు కెప్టెన్లుగా వ్యవహరించారు.

వారికే ఈ సారి డిమాండ్
గత సీజన్ లో ఇషాంత్ కిషన్ రికార్డు ధర పలికిన ఆటగాడుగా నిలిచాడు. ముంబాయి ఇండియన్స్ కిషన్ ను రూ 15.25 కోట్లకు దక్కించుకుంది. అయితే, ముంబై ఈ సారి ఆసక్తి చూపించటం లేదని సమాచారం. అదే విధంగా బౌలర్ గా రాణిస్తున్న అర్షదీప్ సింగ్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉంది. ఈ సారి ప్రధానంగా ఫ్రాంచైజీలు తమ కు అందుబాటులో ఉన్న నిధుల మేరకు యువ క్రికెటర్ల వైపే మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. తాజాగా అండర్ -19 లో పలువురు యువ క్రికెటర్లు సంచలనాలు నమోదు చేసారు. దీంతో, వారికి భారీ డిమాండ్ కనిపిస్తోంది. మొత్తం గా రెండు రోజుల పాటు జరిగే ఈ ఆక్షన్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+