రోహిత్, శార్దూల్ ఒక్క పైసా కూడా ఇవ్వలేదు: చిన్ననాటి కోచ్ (వీడియో)
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, టీమిండియా క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ తన ఫౌండేషన్‌కు ఇప్పటివరకు ఎటువంటి ఆర్థిక సహాయం చేయలేదని వారి చిన్ననాటి కోచ్ దినేష్ లాడ్ వెల్లడించారు. మైఖేల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, తాను కూడా వారిని ఎప్పుడూ ఏమీ అడగలేదని ఆయన స్పష్టం చేశారు. "క్రికెట్ నుంచి వారు దృష్టి మళ్లించకూడదనే ఉద్దేశంతో నేను వారిని ఏమీ అడగలేదు. కానీ, వారి కెరీర్ ముగిసిన తర్వాత కచ్చితంగా సహాయం చేస్తారనే విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు," అని దినేష్ లాడ్ పేర్కొన్నారు.
లాడ్ పర్యవేక్షణలోనే రోహిత్ శర్మ, శార్దూల్ ఠాకూర్ వంటి స్టార్ క్రికెటర్లు ఎదిగారు. 1999లో ఓ సమ్మర్ క్యాంప్‌లో లాడ్ ఆఫ్ స్పిన్నర్‌గా ఉన్న రోహిత్ ప్రతిభను గుర్తించి, అతనిలో బ్యాటింగ్ నైపుణ్యాన్ని పెంపొందించి గొప్ప బ్యాటర్‌గా తీర్చిదిద్దారు. ఆర్థిక కష్టాల్లో ఉన్న రోహిత్‌కు, లాడ్ తాను కోచ్‌గా ఉన్న 'స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్'లో స్కాలర్‌షిప్‌తో ఉచిత సీటు ఇప్పించి అతని జీవితాన్నే మార్చారు. ప్రస్తుతం లాడ్ తన క్రికెట్ ఫౌండేషన్ ద్వారా నిరుపేద, ప్రతిభావంతులైన క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నారు.

లాడ్ కుమారుడు, రంజీ ప్లేయర్ సిద్ధేష్ కూడా ఫౌండేషన్‌కు సహాయం అందిస్తున్నారు. అమెరికా క్రికెటర్ హర్మీత్ సింగ్ రూ.10 లక్షల విరాళం అందించాడు. దేశవాళీ క్రికెటర్ అయిన హర్మీత్, అవకాశాల కోసం అమెరికా వెళ్లి ఆడాడు. ఇటీవల ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో అతను అద్భుత ప్రదర్శన చేశాడు. దినేష్ లాడ్ కామెంట్స్ క్రికెట్ అభిమానులలో ఆశ్చర్యం కలిగించాయి. అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదిగిన రోహిత్ శర్మ తన కోచ్‌కు ఆర్థిక సహాయం చేయకపోవడం నమ్మశక్యంగా లేదని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications