టీమ్‌లో రోహిత్, కోహ్లీకి నో గ్యారంటీ
Gautam Gambhir: సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జట్టులో కొనసాగడంపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టత ఇచ్చారు. ఐసీసీ వరల్డ్ కప్ 2027లో టోర్నమెంట్‌లో ఆడటంపైనా క్లారిటీ ఇచ్చారు. అప్పటివరకు ఫిట్‌నెస్‌తో ఉండగలిగితేనే 2027లో జరిగే ఐసీీసీ వరల్డ్ కప్ ఆడే జట్టులో చోటు కల్పిస్తామని తేల్చి చెప్పారు.
బీసీసీఐ కార్యాలయంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు గౌతమ్ గంభీర్. హెడ్ కోచ్‌గా బాధ్యతలను స్వీకరించిన తరువాత ఆయన తొలి ప్రెస్ కాన్ఫరెన్స్ ఇదే కావడంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. పలు అంశాలపై స్పందించారాయన.

2027 వరల్డ్ కప్ వరకు జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను కొనసాగిస్తారా? అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నలకు గౌతమ్ గంభీర్ సానుకూలంగా స్పందించారు. వారిలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందని వ్యాఖ్యానించారు. టీ20 ఫార్మట్ నుంచి రిటైర్ అయినప్పటికీ వారిని మించిన మేటి బ్యాటర్లు లేరని పేర్కొన్నారు.
వరల్డ్ కప్ వరకు ఆడతారా? లేదా? అనేది వారి ఫిట్‌నెస్ మీద ఆధారపడి ఉందని గంభీర్ అన్నారు. ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ రగలిగితే ఆడొచ్చనీ పేర్కొన్నారు. టీ20 వరల్డ్ కప్ అయినా, 50 ఓవర్ల వరల్డ్ కప్ అయినా తమ సత్తా ఏమిటో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటికే నిరూపించుకున్నారని, మరి కొంతకాలం క్రికెట్ ఆడగల సామర్థ్యం ఉందని వ్యాఖ్యానించారు.
2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ, ఈ ఏడాది నవంబర్‌లో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటించే జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఖచ్చితంగా ఉంటారని వారు తమ ఫిట్‌నెస్‌ను కాపాడుకోగలిగితే 2027 ప్రపంచ కప్‌లో కూడా ఆడొచ్చని గౌతమ్ గంభీర్ స్పష్టం చేశారు. ఇది వారి వ్యక్తిగత నిర్ణయమని, అప్పటివరకు జట్టులో కొనసాగాలా? వద్దా? అనేది వారి ఇష్టమని అన్నారు.












Click it and Unblock the Notifications