రోహిత్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..ముంబై కెప్టెన్‌గా మళ్లీ హిట్ మ్యాన్
సాధారణంగా ఐపీఎల్ స్టార్ అయిందంటే ఆయా జట్ల గురించో , లేదా ఆటగాళ్ల ప్రదర్శన గురించో ఎక్కువుగాచర్చ సాగుతోంది. కానీ ఐపీఎల్ చరిత్రలో మొదటిసారి ఓ కెప్టెన్ గురించి విపరీతమైన చర్చ నడుస్తోంది. ఐపీఎల్‌లో అత్యధికంగా టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు రోహిత్ శర్మను కాదని.. హార్దిక్ పాండ్యాకు జట్టు పగ్గాలు అప్పగించింది. అయితే రోహిత్ శర్మను కెప్టెన్ నుంచి తొలగించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
జట్టుకు ఐదుసార్లు టైటిల్ అందించిన కెప్టెన్‌ను తొలగించి హార్దిక్ పాండ్యాకు ఎలా బాధ్యతలు అప్పగిస్తారంటూ ముంబై ఇండియన్స్ యాజమాన్యంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇదే సమయంలో ముంబై ఇండియన్స్ ఆటగాళ్ల మధ్య కూడా విభేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది. కొందరు ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా అంగీకరించలేకపోతున్నారనే వార్తలు వస్తున్నాయి.ఇక తొలి మ్యాచ్‌లో రోహిత్ పట్ల హార్దిక్ పాండ్యా వ్యవహారించిన తీరు కూడా వివాదాస్పదంగా మారింది.

మ్యాచ్ జరుగుతున్న సమయంలో రోహిత్‌ను కావాలనే హార్దిక్ పాండ్యా బౌండరీ లైన్ వద్దకు పంపించారని రోహిత్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. గ్రౌండ్‌లోనే వీరి మధ్య అభిప్రాయభేదాలు ఉన్నాయని స్పష్టం అయింది. దీనికి తోడు అభిమానుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో ముంబై ఇండియన్స్ యాజమాన్యం దీనిపై కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
రోహిత్ శర్మ , హార్దిక్ పాండ్యాల మధ్య వివాదానికి తెర దించాలని ముంబై ఇండియన్స్ యాజమాన్యం భావిస్తోంది. దీనిలో భాగంగానే ఇద్దరి ఆటగాళ్లతో జట్టు యాజమాన్యం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించినట్టుగా సమాచారం అందుతోంది. దీనిలో భాగంగానే రోహిత్ శర్మను తిరిగి ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా నియమించాలనే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

అయితే ఇప్పటికిప్పుడు హార్దిక్ పాండ్యాను తొలగిస్తే బయటకు వేరే సంకేతాలు వెళ్తాయని..అది జట్టుపై ప్రభావం చూపించే అవకాశం ఉందని భావించిన ముంబై యాజమాన్యం.. ఐపీఎల్ రెండో భాగంలో రోహిత్‌కు జట్టు పగ్గాలు అప్పగించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్ మొదటి షెడ్యుల్‌లో హార్దిక్ పాండ్యా జట్టును ముందుండి నడిపిస్తారని..రెండో భాగంలో రోహిత్ శర్మ జట్టు పగ్గాలు తీసుకుంటారని సమాచారం. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.












Click it and Unblock the Notifications