నన్ను రిలీజ్ చేయండి.. మహాప్రభో: సీఎస్కే వెయిటింగ్ అక్కడ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో నిలకడగా సత్తా చాటుతోన్న ప్లేయర్లల్లో ఒకడు.. సంజు శాంసన్. వికెట్ కీపర్ బ్యాటర్. అటు టీమిండియా తరఫున టీ20 ఇంటర్నేషనల్స్ లోనూ అదరగొడుతున్నాడు. ఈ ఫార్మట్ లో ఇప్పటివరకు మూడు సెంచరీలు బాదాడు. ఈ రికార్డు అతి కొద్దిమందికి మాత్రమే ఉంది.
దశాబ్దానికి పైగా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నాడీ మలయాళీ క్రికెటర్. 2013లో రాజస్థాన్ రాయల్స్ తో టై అప్ అయ్యాడు. అప్పటి నుంచీ అదే జట్టులో కొనసాగుతున్నాడు. 2018లో అతన్ని రిలీజ్ చేసినప్పటికీ.. మళ్లీ అదే ఫ్రాంఛైజీ అతన్ని రిటైన్ చేసుకుంది. 18 కోట్ల రూపాయలతో కాంట్రాక్ట్ పొడిగించుకుంది. సుదీర్ఘకాలంగా జట్టు కేప్టెన్ గా వ్యవహరిస్తోన్నాడు.

ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ కు గుడ్ బై చెప్పాలని సంజు శాంసన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026లో సీజన్ నుండి ఆ జట్టుతో కొనసాగకపోవచ్చు. ఈ డిసెంబర్ లో జరిగే మెగా ఆక్షన్ కోసం ఫ్రాంఛైజీ ముందు రెండు ఆప్షన్లు పెట్టాడు. ఒకటి- తనను ట్రేడింగ్ చేయడం, రెండోది- రిలీజ్ చేయడం.
ఈ రెండింట్లో రిలీజ్ కే అతను మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ ను అధికారికంగా కోరినట్లు క్రిక్‌బజ్ తెలిపింది. ఈ మేరకు ఓ కథనాన్ని ప్రచురించింది. సంజు శాంసన్ ను జట్టులో చేర్చుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తిగా ఉందని, ఈ విషయంపై ఇప్పటికే అతన్ని సంప్రదించిందని చెబుతున్నారు.
దీంతో సంజు శాంసన్- రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ మధ్య అంతర్గతంగా సమస్యలు ఉన్నాయనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీన్ని అతను తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. అంచనాలకు అనుగుణంగా ట్రేడ్ కావట్లేదని సంజు శాంసన్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే- ఆశించిన మొత్తంతో ట్రేడింగ్ చేయడం లేదా ఈ మెగా ఆక్షన్ కోసం రిలీజ్ చేయడం అనే ఆప్షన్లను ఫ్రాంఛైజీ ముందుంచాడని అంటున్నారు.
శాంసన్‌ను అట్టిపెట్టుకోవాలా లేదా విడుదల చేయాలా అనే అంతిమ నిర్ణయం ఫ్రాంఛైజీదే. సంజు శాంసన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ట్రేడింగ్ చేయాలని భావిస్తోన్నప్పటికీ.. ఆ డీల్ అంత సులువుగా పూర్తయ్యే అవకాశం లేదని క్రిక్ బజ్ అంచనా వేసింది. శాంసన్ 18 కోట్ల రూపాయల ప్లేయర్ కావడం వల్ల వన్ వే ట్రేడ్ రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యానికి ఆమోదయోగ్యంగా ఉండబోదని పేర్కొంది.
2013లో ఐపీఎల్ లో అడుగు పెట్టాడు సంజు శాంసన్. ఆడిన మొత్తం 177 మ్యాచ్‌లలో, 149 మ్యాచ్‌లు రాజస్థాన్ రాయల్స్ తరఫునే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇందులో 67 మ్యాచ్‌లలో కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఐపీఎల్ 2022 సీజన్ లో జట్టును ఫైనల్‌కు చేర్చాడు.
ఈ ఐపీఎల్ 2025 సీజన్ లో గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు శాంసన్ దూరం కాగా, రియాన్ పరాగ్ అతని స్థానంలో కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. వైభవ్ సూర్యవంశి వంటి యువ ఆటగాళ్ల రాకతో.. 30 ఏళ్ల శాంసన్‌కు అతని ప్రిఫర్డ్ ఓపెనింగ్ స్థానం దక్కలేదు. ఈ పరిణామాలు కూడా శాంసన్ నిర్ణయం వెనుక గల కారణాలుగా చెబుతున్నారు.
-
IPL 2026: కేకేఆర్‌ను ముంచిన వరుణ్ చక్రవర్తీ.. CSK గ్రాండ్ విక్టరీ! -
బుడ్డోడి వికెట్ కోసం పెద్ద ప్లానే చేశా-ముందే చెప్పి మరీ..! ప్రఫుల్ హింగే షాకింగ్..! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..!












Click it and Unblock the Notifications