భారత్ ను ఫైనల్ చేర్చిన రియల్ హీరో అతనే, గేమ్ ఛేంజర్ - మలుపు తిరిగింది అక్కడే..!!
T20 World Cup: టీమిండియా ఫైనల్ చేరింది. ఉత్కంఠ భరిత మ్యాచ్ లో సెమీ ఫైనల్స్ లో చే జారిన మ్యాచ్ చివరకు భారత్ ఖాతాలో పడింది. ఇంగ్లాండ్ బ్యాటర్ల వీర విహారంతో ఒక దశలో టీం ఇండియా బౌలర్లు చేతులెత్తేసారు. ఇక.. విజయం కష్టమే అనే అభిప్రాయం కనిపించింది. డెత్ ఓవర్లలో సీన్ మారింది. ఇంగ్లాండ్ బ్యాటర్లు బౌండరీలే హద్దుగా చెలరేగుతున్నా.. ఆ సమయం లో గేమ్ ప్లాన్ మొత్తం సీన్ మార్చేసింది. అసలు ఈ సిసలైన టీ20 మ్యాచ్ లో భారత్ కు విజయం అందించి.. ఫైనల్స్ కు చేర్చిన ఘనత ఎవరిది. ముగ్గురు పేర్ల పైన చర్చ సాగుతున్నా.. ఆ గేమ్ ఛేంజర్ ఎవరు..
టీ20 ప్రపంచ కప్ ఫైనల్స్ లో భారత్ అడుగు పెట్టింది. ఈ నెల 7వ తేదీన అహ్మదాబాద్ లో కివీస్ తో సూర్య సేన ఫైనల్స్ ఆడనుంది. సెమీ ఫైనల్స్ లో దాదాపు ఆశలు అడుగంటిన వేళ భారత్ తిరిగి పుంజుకుంది. సెమీఫైనల్ లాంటి ఒత్తిడి మ్యాచ్‌లో భారత ఓపెనర్లలో అభిషేక్ మరోసారి విఫలం అయ్యాడు. సంజూ మాత్రం తన మార్క్ బ్యాటింగ్ చేసాడు. ఇషాన్, సూర్య కుమార్, హార్డిక్, చివరలో శివం దుబే, తిలక్ బ్యాటింగ్ తో భారత్ భారీ స్కోరు చేసింది. 254 పరుగుల భారీ లక్ష్యా న్ని ఛేదించేందుకు ఇంగ్లాండ్ చివరి వరకు పోరాడింది. ఇంగ్లాండ్ తరపున జాకెబ్ బెథెల్ అద్భుతంగా ఆడి 48 బంతుల్లో 105 పరుగులు చేసి జట్టును పోటీలో నిలిపాడు.

అతనికి తోడుగా విల్ జాక్స్5, జాస్ బట్లర్ 25 పరుగులు చేశారు. అయినప్పటికీ చివరికి ఇంగ్లాండ్ 7 పరుగుల తేడాతో ఓడిపోయింది. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆటగాడు మాత్రం సంజూ శాంసన్ . అయితే, సంజూతో పాటుగా ఒత్తిడి భారీగా ఉన్న సమయంలో బూమ్రా.. అద్భుతమైన క్యాచులతో అక్షర్ పటేల్ విన్యాసాలు కోట్లాది మంది క్రికెట్ ఫ్యాన్స్ ను ఆశ్చర్యంలో ముంచేసాయి. ఈ ముగ్గురి పాత్ర సెమీస్ లో విజయం లో కీలకంగా మారాయి.
ఇంగ్లాండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ వికెట్ భారత జట్టుకు మొదటి బ్రేక్ ఇచ్చింది. హార్దిక్ పాండ్యా వేసిన ఓవర్ తొలి బంతికే సాల్ట్ భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. బంతి ఎత్తుగా గాల్లోకి వెళ్లగా, అక్షర్ పటేల్ దానిని సరిగ్గా అంచనా వేసి అద్భుత క్యాచ్ పట్టాడు. అక్షర్ పటేల్ అసలు అద్భుతం తర్వాత జరిగింది. జస్ప్రీత్ బుమ్రావేసిన స్లో బంతిని హ్యారీ బ్రూక్ తప్పుగా టైమ్ చేశాడు. బంతి చాలా ఎత్తుగా గాల్లోకి వెళ్లింది.

ఆ సమయంలో 30 యార్డ్ సర్కిల్‌లో నిలిచిన అక్షర్ పటేల్ దానిని పట్టుకోవడానికి సుమారు 24 మీటర్లు పరుగెత్తాడు. చివరి క్షణంలో డైవ్ చేస్తూ అద్భుతంగా క్యాచ్ పట్టాడు. ఆ తరువాత ఇంగ్లాండ్ ను విజయం వైపు తీసుకెళ్తున్న విల్ జాక్స్ చివరి ఓవర్లలో అర్ష దీప్ బౌలింగ్ లో కొట్టిన షాట్ ను అక్షర్ పటేల్ ఎడమ వైపు దూరం పరుగెత్తి బంతిని అందుకు న్నాడు. వెంటనే శివం దూబేకు అందించాడు. దీంతో.. విల్ జాక్స్ అవుట్ అవ్వటంతో ఇండియన్ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు.

మ్యాచ్ భారత్ వైపు మళ్లింది అక్కడే
ఇక, బూమ్రా చివరి ఓవర్లలో తన అనుభవం.. నైపుణ్యం ప్రదర్శించాడు. ఫుల్ ఫామ్ లో ఉన్న ఇంగ్లాండ్ బ్యాటర్ల నుంచి పరుగులు రాకుండా నియంత్రించాడు. స్వింగ్ లతో ఇబ్బంది పెట్టి సింగిల్స్ కు పరిమితం చేసాడు. ఇలా.. ఈ ముగ్గరితో పాటుగా మరొకరి గురించి సూర్య ప్రత్యేకంగా ప్రస్తావన చేసాడు. మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. "మన ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్‌కు కూడా కొంత క్రెడిట్ ఇవ్వాలి. ఈ మ్యాచ్‌లో మా ఫీల్డింగ్ చాలా కీలక పాత్ర పోషించింది" అంటూ చెప్పుకొచ్చాడు. సెమీఫైనల్ లాంటి ఒత్తిడి మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు అద్భుతంగా ఫీల్డింగ్ చేయడం వల్లే జట్టు విజయం సాధించిందని ఆయన చెప్పుకొచ్చాడు. అయితే, ఏ ఒక్కరిని ఈ గెలుపు లో తక్కువ చేయలేని పరిస్థితి. సమిష్టిగా రాణించి ఒత్తిడి అధిగమించి.. టీం ఇండియా ఫైనల్స్ లో అడుగు పెట్టింది.
-
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications