Ind-NZ ODI: కివీస్ తో వన్డేలకు రిషబ్ పంత్ కు షాక్ ? వికెట్ కీపర్ గా.. !
భారత్, న్యూజీలాండ్ మధ్య కొత్త ఏడాదిలో మూడు వన్డేల సిరీస్ జరగబోతోంది. స్వదేశంలో కివీస్ ను ఎదుర్కొనేందుకు భారత్ సిద్దమవుతోంది. అయితే ఈ సిరీస్ కోసం భారత జట్టును సెలెక్టర్లు త్వరలోనే ప్రకటించబోతున్నారు. ఇందులో మరో సంచలనం చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ వన్డేల్లో రాణిస్తున్న వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ ను ఈ సిరీస్ నుంచి తప్పించేందుకు సెలెక్టర్లు సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కివీస్ తో భారత్ జనవరి 11, 14, 18 తేదీల్లో వడోదర, రాజ్ కోట్, ఇండోర్ లో మూడు వన్డేలు ఆడబోతోంది. గతేడాది స్వదేశంలో కివీస్ చేతిలో 0-3 తేడాతో టెస్టు సిరీస్ కోల్పోయిన భారత్.. ఇప్పుడు ఈ వన్డే సిరీస్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. దీంతో ఈ సిరీస్ లో ఆడే క్రికెటర్ల ఎంపికలో బీసీసీఐ కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ గా రిషబ్ పంత్ ను తప్పించి ఇషాన్ కిషన్ ను ఎంపిక చేయబోతున్నట్లు తెలుస్తోంది.

న్యూజిలాండ్‌తో త్వరలో జరిగే మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు జార్ఖండ్ వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ ఇషాన్ కిషన్ ను ఎంపిక చేసేందుకు సెలెక్టర్లు సిద్దమయ్యారు. తాజాగా దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్న ఇషాన్ కు ఈసారి వన్డే జట్టులో స్ధానం కల్పించాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు రిషబ్ పంత్ చివరి సారిగా 2024 ఆగస్టులో కొలంబోలో శ్రీలంకతో జరిగిన వన్డేలో ఆడాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో అతనికి చోటు దక్కినప్పటికీ, అతను ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.

తాజాగా బుధవారం అహ్మదాబాద్‌లో కర్ణాటకతో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ 33 బంతుల్లో సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. లిస్ట్-ఎ క్రికెట్‌లో ఒక భారతీయ క్రికెటర్ చేసిన రెండవ వేగవంతమైన సెంచరీగా ఈ ఇన్నింగ్స్ నిలిచింది. అదే రోజు అరుణాచల్ ప్రదేశ్‌పై 32 బంతుల్లో ఈ మైలురాయిని చేరుకున్న బీహార్ కెప్టెన్ సకిబుల్ గని నెలకొల్పిన జాతీయ రికార్డు కంటే కేవలం ఒక బంతి దూరంలో ఈ ఇన్నింగ్స్ నిలిచింది.












Click it and Unblock the Notifications