శ్రేయస్ అయ్యర్ చెల్లెలని వదిలిపెట్టని దుర్మార్గులు
శ్రేయాస్ అయ్యర్ చెల్లెలు శ్రేష్టా అయ్యర్ అభిమానుల ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓటమి పాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 157 పరుగులు చేసింది. అనంతరం ఈ లక్ష్యాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18.5 బంతుల్లోనే చేధించి విజయాన్ని సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఓడిపోవడంతో ఆ జట్టు అభిమానులు కెప్టెన్ శ్రేయాస్‌పై ఫైర్ అయ్యారు. కుటుంబ సభ్యులను సైతం ఘాటుగా విమర్శించారు.దీనిపై శ్రేయాస్ అయ్యర్ చెల్లెలు శ్రేష్టా అయ్యర్ స్పందిచారు.
పంజాబ్ కింగ్స్ ఓటమికి శ్రేయాస్ కుటుంబ సభ్యులను నిందించడంపై ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఘాటైన పోస్ట్ పెట్టారు. జట్టును కేవలం ప్రోత్సహించినందుకు తమ కుటుంబాన్ని నిందించడం చాలా నిరాశ కలిగించిందని ఆమె అన్నారు. శ్రేష్టా అయ్యర్ తన పోస్ట్‌లో అభిమానుల యొక్క "కురుచ బుద్ధి"ని ఎత్తిచూపారు. తాము స్టేడియంలో ఉన్నా లేదా దూరం నుండి మద్దతు తెలుపుతున్నా, జట్టుకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. గెలుపు ఓటములు ఆటలో సహజమని, తెర వెనుక నుండి ట్రోల్ చేసేవారికి వాస్తవాలు పట్టవని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు.

కొందరు అభిమానులు హద్దులు మీరి వ్యక్తిగత దూషణలకు పాల్పడటం బాధాకరమని శ్రేష్టా ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక క్రీడా జట్టుకు సంబంధించిన విషయం మాత్రమేనని, ఆటగాళ్ల కుటుంబాలను ఇందులోకి లాగడం సరికాదని ఆమె సూచించారు. తన సోదరుడికి, అతని జట్టుకు తాను ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటానని ఆమె ధైర్యంగా ప్రకటించారు. విమర్శలు తనను ఏ మాత్రం కదిలించలేవని, ఇది కేవలం విమర్శించే వారి అజ్ఞానాన్ని చూపుతుందని ఆమె స్పష్టం చేశారు.
శ్రేష్టా అయ్యర్ యొక్క ఈ స్పందన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కొందరు ఆమెకు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, క్రీడాభిమానులు హద్దులు పాటించాలని, ఆటను ఆటలా చూడాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆటగాళ్ల వ్యక్తిగత జీవితాల్లోకి చొచ్చుకుపోవడం, వారి కుటుంబ సభ్యులను దూషించడం సరైనది కాదని వారు అంటున్నారు. ఈ ఘటన క్రీడా ప్రపంచంలో అభిమానుల ప్రవర్తనపై మరోసారి చర్చకు దారితీసింది.












Click it and Unblock the Notifications