Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

World Cup: పాక్ తో మ్యాచ్ వేళ టీమిండియాకు గుడ్ న్యూస్ -అహ్మదాబాద్ కు గిల్..!!

ప్రపంచ కప్ సమరంలో అసలైన మ్యాచ్ కు టీమిండియా సిద్దం అవుతోంది. కోట్లాది అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తన్న భారత్ వర్సస్ పాక్ ప్రపంచ కప్ సమరం ఈ నెల 14న జరగనుంది. ఈ రోజున ఢిల్లీలో ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే మ్యాచ్ తరువాత టీమిండియా అహ్మదాబాద్ చేరుకోనుంది. ఈ సమయంలోనే మరో గుడ్ న్యూస్ అందింది. డాషింగ్ ఓపెనర్ శుభమన్ గిల్ చెన్నై నుంచి అహ్మదాబాద్ చేరుకుంటున్నాడు. ఈ వార్త తెలిసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

అహ్మదాబాద్ కు గిల్ : పాకిస్థాన్ తో కీలక మ్యాచ్ వేళ టీమిండియా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ . ప్రపంచ కప్ సమరంలో తొలి మ్యాచ్ లో ఆసీస్ పై నెగ్గిన టీమిండియా ఈ రోజు ఢిల్లీలో ఆఫ్ఠన్ గా తల పడనుంది. తొలి మ్యాచ్ లో కోహ్లీ - రాహుల్ సంయమనంతో ఆడుతూ..తమ అనుభవంతో టీంను విజయానికి చేర్చారు ఇప్పుడు ఆఫ్ఘన్ తో మ్యాచ్ తరువాత అసలైన సమరానికి టీమిండియా సిద్దం అవుతోంది.

Shubhman Gill All set to to fly to Ahmedabad ahead Crucial match against Pakistan on 14th October

ఈ నెల 14న అహ్మదాబాద్ లో పాక్ తో జరిగే మ్యాచ్ కోసం ఫ్యాన్స్ నిరీక్షిస్తున్నారు. ఈ మ్యాచ్ వేళ నిర్వాహకులు గ్రాండ్ గా ఏర్పాట్లు చేస్తున్నారు. సెలబ్రెటీలు ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు తరలి వస్తున్నారు. ఈ సమయంలోనే తొలి మ్యాచ్ కు దూరమైన గిల్ కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది.

డెంగ్యూ చికిత్స తీసుకుంటూ : డెంగ్యూ కారణంగా ఆసీస్ తో మ్యాచ్ కు గిల్ దూరమయ్యాడు. ప్లేట్ లెట్స్ కౌంట్ భారీగా పడిపోవటంతో చెన్నైలోని ఒక ప్రముఖ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నాడు. దీంతో, ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ కోసం మిగిలిన జట్టు ఢిల్లీకి బయలుదేరింది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఈరోజు చెన్నై నుంచి అహ్మదాబాద్‌కు బయల్దేరనున్నాడు. గిల్ బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో కోలుకుంటున్నాడు.

దీంతో అతడు పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉందని అంచనాలు మొదలయ్యాయి. బీసీసీఐ మాత్రం గిల్ ఆరోగ్యానికి సంబంధించి అధికారికంగా సమాచారం ఇవ్వలేదు. ప్లేట్‌లెట్ల సంఖ్య లక్ష కంటే తక్కువగా ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా ఆసుపత్రిలో చేరాడు. అయితే ఒక్క రాత్రి మాత్రమే ఉండి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు.

Shubhman Gill All set to to fly to Ahmedabad ahead Crucial match against Pakistan on 14th October

పాక్ తో మ్యాచ్ వేళ : డెంగ్యూ నుంచి కోలుకున్నా పాకిస్థాన్ తో మ్యాచ్ కు ఫిట్ అవుతాడా లేదా అనేది సందేహమే. డెండ్యూ నుంచి కోలుకున్న తరువాత కనీసం వారం రోజులు విశ్రాంతి అవసరం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. కానీ, ఇంత త్వరగా గిల్ తిరిగి గ్రౌండ్ లోకి దిగటం కష్టమని తెలుస్తోంది. దీంతో, గిల్ స్థానంలో ఇషాన్ కిషన్ ఓపెనర్ గా బ్యాటింగ్ ప్రారంభిస్తున్నాడు.

టీం ఇండియా గిల్ స్థానంలో రుతురాజ్, జైశ్వాల్ వైపు చూస్తోంది. అయితే భారత్‌కు శుభ్‌మన్ గిల్ చాలా ముఖ్యమైన బ్యాట్స్‌మెన్. అహ్మదాబాద్‌లో గిల్‌ రికార్డు అద్భుతంగా ఉంది. ఇప్పుడు గిల్ అహ్మదాబాద్ కు రానుండటం తో పాక్ మ్యాచ్ లో ఆడుతాడా లేదా అనేది ఇప్పుడు ఉత్కంఠ కు కారణమవుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+