అర్ధాంతరంగా పెళ్లి ఆగిపోవడంతో స్మృతి మంధాన అనూహ్య నిర్ణయం..!!
సంగీత దర్శకుడు పలాష్ ముచ్ఛల్ తో జరగాల్సిన వివాహం నిరవధికంగా వాయిదా పడిన నేపథ్యంలో క్రికెటర్ స్మృతి మంధాన కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మెహందీ, హల్దీ ఫంక్షన్, పెళ్లి ఫొటోలన్నింటినీ కూడా డిలెట్ చేశారు. పెళ్లి పీటలు ఎక్కడానికి రెండు గంటల ముందు మంధాన తండ్రి శ్రీనివాస్ గుండెపోటుకు గురి కావడం, వెంటనే ఆయనను ఆసుపత్రిలో అడ్మిట్ చేయాల్సి రావడం వంటి కారణాల వల్ల ఈ పెళ్లి ఆగిపోయింది.
ఈ అనూహ్య ఘటనతో వివాహ వేడుక నిరవధికంగా వాయిదావేశారు కుటుంబ సభ్యులు. మంధాన తండ్రి ఆసుపత్రిలో చేరిన మరుసటి రోజు పలాష్ ముచ్ఛల్ కూడా సాంగ్లీ ఆసుపత్రిలో చేరారు. ఇది మరింత ఆందోళన కలిగించింది. అక్కడ చికిత్స అనంతరం పలాష్ ముచ్చల్ ముంబైకి తిరిగి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని పలాష్ తల్లి అమిత ముచ్ఛల్ నిర్ధారించారు. పెళ్లి వాయిదా పడిన మరుసటి రోజు కుటుంబంతో కలిసి ముంబైకి వచ్చినట్లు తెలిపారు.

2019 నుండి ప్రేమలో ఉన్నారు స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్. ఈ జంట.. పెళ్లి పీటలు ఎక్కడం, మూడుముళ్ల బంధంతో ఒక్కటి కావడమే ఆలస్యం అనుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. పెళ్లి వేదికలోకి అంబులెన్స్ ప్రవేశించడంతో కుటుంబంలో ఆరోగ్య సమస్యలు తలెత్తాయనే ఊహాగానాలు మొదలయ్యాయి. అంబులెన్స్ లోపలికి వెళ్లగానే, అతిథుల్లో ఆందోళన కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
అంబులెన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అత్యవసర పరిస్థితికి గల కారణాలపై ప్రశ్నలు తలెత్తాయి. తొలుత- పెళ్లికి వచ్చిన ఓ అతిథికి అనారోగ్యం అంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత శ్రీనివాస్ మంధానా తండ్రి ఆరోగ్యం క్షీణించిందని తుహిర్ మిశ్రా స్పష్టం చేశారు. దీంతో కుటుంబం మొత్తం వివాహాన్ని వాయిదా వేయాలని నిర్ణయించుకుంది. అనారోగ్యం వివరాలు వెల్లడించనప్పటికీ గుండెపోటు సంభవించినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications