World Cup 2023: నో డౌట్ - ఫైనల్ చేరేది ఆ రెండు జట్లే, ఇదీ లెక్క..!!

ప్రపంచ కప్ క్రికెట్ లో అసలు సమరం మొదలైంది. సెమీస్ లో నాలుగు హేమా హేమీ జట్లు చేరాయి. రెండు సెమీస్ మ్యాచ్ లపైనా భారీ ఉత్కంఠ కనిపిస్తోంది. తొలి సెమీస్ లో భారత్ వర్సస్ న్యూజీలాండ్ మ్యాచ్ పైన భారీ అంచనాలు ఉన్నాయి. 2019 ప్రపంచ కప్ లో సెమీస్ తో ఇదే న్యూజీలాండ్ చేతిలో ఓడిన టీమిండియా ఈ సెమీస్ లో రివేంజ్ తీర్చుకొని ఫైనల్ బెర్తు ఖాయం చేసుకుంటుందని క్రికెట్ లెజెండ్స్ విశ్లేషిస్తున్నారు.

సెమీస్ తో గెలుపెవరిది:ప్రపంచ కప్ లో ఇప్పటి వరకు ఓటమి లేకుండా విజయపరంపర కొనసాగిస్తున్న టీమిండియా అగ్రస్థానంలో నిలిచింది. ఇక ఇప్పుడు సెమీస్ తో ధీటైన ప్రత్యర్ధి న్యూజీలాండ్ తో తలపడుతోంది. ఈ ప్రపంచ కప్ లో భారత్ ఆడిన అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించింది. ఇక సెమీస్ లో గత చరిత్ర క్రికెట్ ఫ్యాన్స్ ను వెంటాడుతోంది. అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపిస్తున్న టీమిండియా అంతే బలంగా ఉన్న కివీస్ టీం తో ఈ నెల 15ప ముంబాయి వేదికగా ఆడే సెమీస్ పైన భారీ అంచనాలు ఉన్నాయి. 2019 లో సెమీస్ లో కివీస్ చేతిలో భారత్ పరాజయం పాలైంది. కానీ, ఇప్పుడు టీం చాలా బలంగా కనిపిస్తోంది. అందునా సొంత గడ్డ పైన..ముంబాయి గ్రౌండ్ లో జరుగుతున్న మ్యాచ్ కావటంతో కలిసి వస్తుందని..అంచనాలు ఉన్నాయి.

South Africa cricketer Hashim Amla makes his choices on who will be the finalists of the 2023 ODI World Cup

రోహిత్ సేనకు సూచనలు:ఇక, సెమీస్ బెర్తులు ఖాయం కావటంతో..గెలిచేదెవరు..ఫైనల్ ఎవరు చేరుతారు..విజేతగా ఎవరు నిలుస్తారనే దాని పైన క్రికెట్ లెజెండ్స్ విశ్లేషణలు చేస్తున్నారు. దాదాపుగా అందరూ భారత్ కే విజేతగా నిలిచే అవకాశాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. అయితే, సెమీస్ లో ఎలా ఆడుతామో అనే సందేహాలు..అనుమానాలు వదిలేసి ఇప్పుడున్న టీం ఇండియా ఇప్పటి వరకు రాణించిన తరహాలోనే సెమీస్ లోనూ ముందుకు వెళ్తే విజయం ఖాయమని సూచిస్తున్నారు. ఇదే అంశం పైన సౌతాఫ్రికా లెజండ్ హషీం ఆమ్లా తన అంచనాలను వెల్లడించాడు. హషీం సౌతాఫ్రికా తరుపున అతర్జాతీయ క్రికెట్ లో మ్యాచ్ లు ఆడాడు. ప్రస్తుత ప్రపంచ కప్ లో రెండు సెమీస్ లో గెలిచేదెవరు..ఫైనల్ లో తలపడేది ఎవరనేది అంచనా వేసాడు.

ఫైనల్ లో ఆడేది ఆ జట్లే:హషీం ఆమ్లా అంచనాల మేరకు తొలి సెమీస్ లో న్యూజీలాండ్ పైన భారత్ గెలుస్తుందని చెప్పుకొచ్చాడు. రెండో సెమీస్ లో ఆస్ట్రేలియా పైన సౌతాఫ్రికా గెలుస్తుందని ప్రిడిక్ట్ చేసాడు. భారత్ వర్సస్ సౌతాఫ్రికా రెండు టీంలు ఈ నెల 19న అహ్మదాబాద్ లో జరిగే ఫైనల్స్ లో తల పడుతాయని విశ్లేషించాడు. సొంత గ్రౌండ్ లో లక్షా 35 వేల మంది అభిమానుల సమక్షంలో అహ్మదాబాద్ వేదికగా భారత్ ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాతో తల పడుతుందని అంచనాగా వెల్లడించాడు. హషీం తో పాటుగా పలువురు క్రికెట్ నిపుణులు సైతం భారత్ కు ఎటువంటి సందేహాలు..నెగటివ్ ఆలోచనలు లేకుండా న్యూజీలాండ్ తో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగితే విజయం ఖాయమని రోహిత్ సేనకు సూచిస్తున్నారు. దీంతో..ఇప్పుడు కోట్లాది మంది క్రికెట్ ఫ్యాన్స్ ముంబాయిలో జరిగే భారత్ - కివీస్ సెమీస్ వైపు ఉత్కంఠగా చూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+