IPL 2026: మలుపు తిప్పిన అభిషేక్.. SRH హ్యాట్రిక్!
ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) జోరు కొనసాగుతోంది. హోమ్ గ్రౌండ్ ఉప్పల్‌లో ఆరెంజ్ ఆర్మీ హ్యాట్రిక్ విక్టరీ నమోదు చేసింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ అజేయ శతకంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 47 పరుగుల భారీ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. అభిషేక్ శర్మ తన విధ్వంసకరమైన బ్యాటింగ్‌తో ఈ మ్యాచ్‌ను ఏకపక్షం చేశాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 242 పరుగుల భారీ స్కోర్ చేసింది. అభిషేక్ శర్మ(68 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్స్‌లతో 135 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. ట్రావిస్ హెడ్(26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37), హెన్రీచ్ క్లాసెన్(13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 నాటౌట్) దూకుడుగా ఆడారు. ఇషాన్ కిషన్(13 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 25) పర్వలేదనిపించాడు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక్కడే ఒక వికెట్ తీయగా.. మిగతా బౌలర్లు విఫలమయ్యారు.

అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 195 పరుగులే చేసి ఓటమిపాలైంది. నితీష్ రాణా(30 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీతో రాణించగా.. కేఎల్ రాహుల్(23 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 37), సమీర్ రిజ్వీ(28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41) దూకుడుగా ఆడే క్రమంలో వెనుదిరిగారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఎషాన్ మలింగా నాలుగు వికెట్లు తీయగా.. హర్ష్ దూబే(3/12) మూడు వికెట్లు పడగొట్టాడు. దిల్షాన్ మదుషంక, సకీబ్ హుస్సేన్ తలో వికెట్ తీసారు. ఈ విజయంతో ఆరెంజ్ ఆర్మీ పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానంలో నిలిచింది.
మలుపు తిప్పిన అభిషేక్ శర్మ..
అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో ఈ మ్యాచ్ ఏకపక్షంగా ముగించాడు. ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ముద్దుగా పులి అని పిలుచుకునే అభిషేక్ 20 ఓవర్ల పాటు క్రీజులో ఉండి ఢిల్లీ పతనాన్ని శాసించాడు. గతంలోలా గుడ్డిగా ఆడకుండా అభిషేక్ శర్మ ఓపికగా బ్యాటింగ్ చేశాడు.
మంచి బంతులకు సింగిల్స్ తీస్తూ జోన్‌లోకి వచ్చిన వాటిని బౌండరీకి తరలించాడు. అతని విధ్వంసంతో ఢిల్లీ క్యాపిటల్స్ చేతులెత్తేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఛేదించాల్సిన రన్‌రేట్ పెరుగుతుండటంతో దూకుడుగా ఆడాలనే ప్రయత్నంలో ఢిల్లీ బ్యాటర్లు వికెట్లు పారేసుకున్నారు.












Click it and Unblock the Notifications