కాటేరమ్మ కొడుకులు అంటిరి కదరా
SRH vs MI: ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఓటమిని ఖాయం చేసుకున్నట్టే కనిపిస్తోంది. ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అధ్వాన్నంగా ఆడుతోంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆరెంజ్ ఆర్మీ.. 13 పరుగులకే ఏకంగా నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్‌కు దిగింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఏ మాత్రం కూడా కుదురుగా ఆడలేకపోతోంది. టాప్ ఆర్డర్ బ్యాటర్లందరూ ఆయారాం గయారాంలా తయారయ్యారు. 13 పరుగులకే నలుగురు బ్యాటర్లు పెవిలియన్ చేరారంటే ఆ జట్టు బ్యాటింగ్ ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

రెండో ఓవర్‌లో ఆరంభమైన బ్యాటింగ్ పతనం 4.1 ఓవర్ వరకూ యథేచ్ఛగా కొనసాగింది. రెండో ఓవర్ రెండో బంతికి ట్రావిస్ హెడ్ డకౌట్ అయ్యాడు. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో నమన్ ధీర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు హెడ్. అప్పటికి జట్టు స్కోరు రెండు పరుగులే. బౌల్ట్ వికెట్లకు కాస్త దూరంగా వేసిన లెంగ్త్ డెలివరీని కవర్స్ మీదుగా భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు హెడ్.
బ్యాట్ టాప్ ఎడ్జ్ తీసుకున్న ఆ బంతి.. డీప్ బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా గాల్లోకి లేచింది. అక్కడే ఉన్న నమన్ ధీర్ దీన్ని అందుకున్నాడు. రెండో ఓవర్ తొలి బంతికి ఇషాన్ కిషన్ అవుట్ అయ్యాడు. దీపక్ చాహర్ వేసిన బంతిని ఆడటంలో తికమకపడ్డాడు ఇషాన్ కిషన్. ఆ బంతి నేరుగా వెళ్లి వికెట్ కీపర్ రియాన్ రికెల్టన్ చేతుల్లో వాలింది.
ఆ వెంటనే క్రీజ్‌ను వదిలాడు ఇషాన్ కిషన్. ఇక్కడే హైడ్రామా చోటు చేసుకుంది. అతను క్రీజ్‌ను వదలడం చూసిన తరువాతే అంపైర్ అవుట్ ఇచ్చాడు. నిజానికి బౌలర్ దీపక్ చాహర్ గానీ, వికెట్ కీపర్ రికెల్టన్ గానీ అవుట్ అయినట్టు అప్పీలే చేయలేదు. బంతి బ్యాట్‌కు కనెక్ట్ కాలేదని స్నీకో మీటర్‌లో స్పష్టంగా తేలింది. ఇషాన్ చేసింది ఒక పరుగే.
ఆ తరువాత ఓపెనర్ అభిషేక్ శర్మ గానీ, నితీష్ కుమార్ గానీ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిల్చోలేదు. అభిషేక్ శర్మ- 8, నితీష్ కుమార్ రెడ్డి- 2 పరుగులు చేశారంతే. జట్టు స్కోర్ 35 పరుగుల వద్ద అయిదో వికెట్ పడింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో అనికేత్ వర్మ అవుట్ అయ్యాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లల్లో ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్ రెండేసి చొప్పున వికెట్లు పడగొట్టారు. హార్దిక్ పాండ్యా ఓ వికెట్ తీసుకున్నాడు.












Click it and Unblock the Notifications