సన్‌రైజర్స్ ను గెలిపించిన ఆ ఘటన- కీలక మలుపు
SRH vs Punjab Kings: ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎదుర్కొంటోన్న వరుస పరాయజాలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. బిగ్ బ్యాంగ్‌తో కమ్ బ్యాక్ అయింది ఆరెంజ్ ఆర్మీ. పంజాబ్ కింగ్స్‌పై స్వైర విహారం చేసింది. కొండంత స్కోర్‌ను ఐస్‌క్రీమ్‌లా కరిగించి పడేసింది. ఈ నెల 17వ తేదీన తరువాతి మ్యాచ్ ఆడబోతోంది. ముంబై ఇండియన్స్‌ను ఢీ కొట్టనుంది.
ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లను ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఇది రెండో విజయం. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించిన తరువాత ఇప్పుడు మళ్లీ ట్రాక్ ఎక్కింది. ఈ మధ్యలో నాలుగింట్లో పరాజయాన్ని చవి చూసింది. ఈ గెలుపుతో సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి ఎగబాకింది.

ఉప్పల్ స్టేడియంలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్.. దుమ్ము రేపింది. నిర్ణీత 20 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి ఏకంగా 245 పరుగులు పిండుకుంది. శ్రేయస్ అయ్యర్ కేప్టెన్సీ ఇన్నింగ్ ఆడాడు. 36 బంతుల్లో ఆరు భారీ సిక్సర్లు, ఆరు బుల్లెట్ల వంటి ఫోర్లతో 82 పరుగులు చేశాడు.
ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య- 36, ప్రభ్‌సిమ్రన్ సింగ్- 42, మిడిలార్డర్‌లో నెహల్ వధేరా- 27 సత్తా చాటారు. ఇన్నింగ్ చిట్టచివరి ఓవర్‌లో మార్కస్ స్టొయినిస్ సునామీలా విరుచుకుపడటంతో పంజాబ్ కింగ్స్‌కు అదనపు పరుగులొచ్చాయి. మహ్మద్ షమీ వేసిన 20వ ఓవర్ చివరి నాలుగు బంతులను సిక్సర్లుగా మలిచాడు స్టొయినిస్.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. తెగించి ఆడింది. చావో రేవో అన్నట్లుగా చెలరేగారు బ్యాటర్లు. తొలి ఓవర్ నుంచే బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. 245 పరుగులను ఇంకా తొమ్మిది బంతులు మిగిలివుండగానే కొట్టిపడేశారంటే వాళ్ల బ్యాటింగ్ విధ్వంసం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ట్రావిస్ హెడ్ 66 పరుగులతో దూకుడుగా ఆడగా..మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 55 బంతుల్లోనే 141 పరుగులు కొట్టాడు. ఈ క్రమంలో ఏకంగా 10 సిక్సర్లు బాదాడు అభిషేక్. మరో 14 బౌండరీలు అతని బ్యాట్ నుంచి జాలువారాయి. ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు దిగి 17వ ఓవర్ వరకు ఆడిన బ్యాటర్లల్లో 256 స్ట్రైక్ రేట్‌ను మెయింటెయిన్ చేశాడు.
నిజానికి అభిషేక్ శర్మ ఎప్పుడో అవుట్ అయ్యేవాడు. ఇన్నింగ్ నాలుగో ఓవర్‌లోనే అవుట్ అయ్యాడు గానీ అది నో బాల్ కావడం వల్ల లైఫ్ లభించింది. యాష్ ఠాకూర్ వేసిన ఓవర్ అది. లెంగ్తీ డెలివరీని డీప్ బ్యాక్‌వర్డ్ పాయింట్ మీదుగా భారీ షాట్ ఆడాడు అభిషేక్. సరిగ్గా కనెక్ట్ కాకపోవడం వల్ల గాల్లోకి లేచిన బంతిని శశాంక్ సింగ్ అందుకున్నాడు.
అప్పటికి అభిషేక్ శర్మ చేసిన పరుగులు.. 35. శశాంక్ క్యాచ్ పట్టడంతో అభిషేక్ శర్మ నిరాశగా క్రీజ్‌ను వదిలాడు కూడా. అది నో బాల్ అంటూ సైరన్ మోగడం.. అంపైర్ సిగ్నల్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. అంతే.. ఆ నెక్స్ట్ బంతినే సిక్సర్‌గా మలిచాడీ లెఫ్ట్ హ్యాండర్. ఆ తరువాత వెనుదిరిగి చూడలేదు.
ఈ నో బాల్‌కు ముందు 12 బంతులను ఎదుర్కొన్న అభిషేక్ 35 పరుగులు చేశాడు. 291.67 స్ట్రైక్ రేట్‌ను అందుకున్నాడు. ఆ తరువాత కూడా అదే మొమెంటమ్‌ను కంటిన్యూ చేశాడు. ఆ తరువాత ఎదుర్కొన్న 47 బంతుల్లో 106 పరుగులను పిండుకున్నాడు. ఆ నో బాల్ ఎంత కాస్ట్లీ అనేది పంజాబ్ కింగ్స్ బోధపడివుండొచ్చు.












Click it and Unblock the Notifications