Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సరిపోయింది.. హీరో, విలన్ కొట్టుకుని కమేడియన్ మీద పడ్డట్టు: శ్రీలంక విలవిల

టీ20 వరల్డ్ కప్ ఎంతో దూరం లేదు. ఇంకొక్క రోజే మిగిలివుంది. ఈ నెల 7వ తేదీన ప్రారంభం కాబోతోందీ టోర్నమెంట్. ప్రస్తుతం వామప్స్ నడుస్తున్నాయి. దీనికి తోడు బీసీసీఐ కేంద్రబిందువుగా వివాదాలూ చుట్టుముట్టాయి. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఈ నెల 15వ తేదీన భారత్‌ను ఢీ కొనాల్సి ఉంది పాకిస్తాన్. ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని పాకిస్తాన్ నిర్ణయం తీసుకుంది. లీగ్ దశలో భారత్ తో జరగాల్సిన మ్యాచ్ లన్నింటినీ కూడా బాయ్ కాట్ చేసినట్లు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ స్వయానా ప్రకటించారు.

శ్రీలంక ఆందోళన..

ఈ వ్యవహారంపై శ్రీలంక స్పందించింది. భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరించాలన్న నిర్ణయంపై పునరాలోచించుకోవాలని శ్రీలంక క్రికెట్ బోర్డు శ్రీలంకకు విజ్ఞప్తి చేసింది. ఈ మ్యాచ్ రద్దయితే భారీ ఆర్థిక, పర్యాటక నష్టాలు వాటిల్లుతాయని పేర్కొంది. భారత్- పాకిస్తాన్ మ్యాచ్ కు తమ దేశంలో అత్యంత ఆదరణ ఉంటుందని, ఇది రద్దయితే టికెట్లు అమ్ముడుపోవని, స్పాన్సరర్లు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మ్యాచ్ ను చూడటానికి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు తరలివస్తారని, పర్యాటకరంగం కూడా నష్టపోతుందని పేర్కొంది.

Sri Lanka calls on Pakistan to rethink India boycott in T20 World Cup Match as losses mount Report

క్రికెట్ ను మించి..

భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. అటు ప్రపంచ క్రికెట్‌లో మాత్రమే కాకుండా.. వాణిజ్యపరంగా కూడా అత్యంత కీలకమనే విషయం తెలిసిందే. ఉత్కంఠభరితంగా సాగే ఈ పోరును క్రికెట్ ను మించి మరింత అతీతంగా భావిస్తారు కోట్లాదిమంది. ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో వీక్షకులను ఆకర్షిస్తుందీ గేమ్. ఐసీసీకి వచ్చే ఆదాయంలో అత్యధిక వాటా ఈ మ్యాచ్ లదే. అలాంటిది- దీన్నే బాయ్ కాట్ చేయడం ఆర్థికంగా భారీ నష్టాలను మిగుల్చుతుందనేది శ్రీలంక అభిప్రాయం. టీ20 వరల్డ్ కప్ కు కో హోస్ట్ గా వ్యవహరిస్తోందా దేశం.

పునరాలోచించుకోవాలని కోరుతూ..

పాకిస్తాన్ వైదొలగిన నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డు కార్యనిర్వాహక కమిటీ తాజా సమావేశమైంది. భారత్‌తో జరగాల్సిన గ్రూప్-స్టేజ్ మ్యాచ్‌ను పాకిస్థాన్ బహిష్కరించే నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరుతూ పీసీబీకి అధికారికంగా లేఖ రాయాలని నిర్ణయించింది. గురువారం రాత్రి ఈ లేఖను పీసీబీకి పంపించినట్లు స్థానిక మీడియా తెలిపింది.

అన్ని రకాలుగా నష్టపోతాం..

ఈ పరిణామం భారత్, శ్రీలంక క్రికెట్ బోర్డులకే కాకుండా టోర్నమెంట్ నిర్వాహకులు, ఆతిథ్య దేశ వాటాదారులకు కూడా గణనీయమైన ఆదాయ నష్టాలకు దారితీస్తుందని తెలిపింది. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఓ లేఖ రాసింది. హోటల్ బుకింగ్స్, ఫ్లైట్ రిజర్వేషన్లు సైతం రద్దు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే మ్యాచ్ నిర్వహణలో పాలుపంచుకునే స్థానిక లాజిస్టిక్స్, సర్వీస్ ప్రొవైడర్లు/ఆపరేటర్ల ఆదాయానికి గండిపడుతుందని తెలిపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+