క్రికెటర్‌కు గ్రౌండ్‌లోనే టైట్ హగ్ ఇచ్చిన స్టార్ హీరోయిన్
ఐపీఎల్‌లో సినీ తారల సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సంవత్సరం ఐపీఎల్‌లో సినీ తారల సందడి మరింత ఎక్కువగా ఉంది. చాలా మంది బాలీవుడ్ , టాలీవుడ్ నటులు ఈ లీగ్‌లో పాల్గొంటున్నారు.చాలా మంది సినీ తారలు తమ అభిమాన జట్లను ప్రోత్సహించడానికి స్టేడియాలకు వస్తున్నారు. షారుఖ్ ఖాన్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు యజమాని కాబట్టి, అతను చాలా మ్యాచ్‌లకు హాజరవుతున్నారు.అనన్య పాండే చిన్నప్పటి నుండి కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు అభిమాని. ఆమె మ్యాచ్‌లను చూసేందుకు క్రమం తప్పకుండా స్టేడియానికి వస్తున్నారు.
PREITY ZINTA WITH CAPTAIN SHREYAS IYER & BOTH TEAM'S PLAYERS TOGETHER. 👌
— Tanuj (@ImTanujSingh) April 6, 2025
- A beautiful Video! ❤️ pic.twitter.com/7g4jwCA5Z5
ఈక్రమంలోనే హీరోయిన్ ప్రీతి జింటా సైతం పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌ల్లో సందడి చేస్తుంటారు. పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రీతి జింటా సహ యజమానిగా కొనసాగుతున్నారు.ప్రీతి జింటా జట్టు మ్యాచ్‌లలో తరచుగా కనిపిస్తూ, జట్టును ఉత్సాహపరుస్తూ ఉంటారు. దీనిలో భాగంగానే శనివారం పంజాబ్ కింగ్స్ జట్టు ,రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు ప్రీతి జింటా హాజరయ్యారు.ఈ ఏడాది జరుగుతున్న ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు అదరగొడుతుంది.వరుస మ్యాచ్‌లో విజయం సాధిస్తుంది. అయితే పంజాబ్ కింగ్స్ జట్టు ఈ సీజన్‌లో తొలి ఓటమిని చవి చూసింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు పంజాబ్ కింగ్స్‌ను వారి స్వంత మైదానంలో 50 పరుగుల తేడాతో ఓడించింది.

పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టు తమ మొదటి ఓటమిని చవిచూసిన తర్వాత, జట్టు సహ-యజమాని అయిన ప్రీతి జింటా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను ఓదార్చేందుకు ఆప్యాయంగా హత్తుకున్నారు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓడిపోయిన తర్వాత ఈ సంఘటన జరిగింది. మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు కలుసుకుంటున్న సమయంలో, నిరాశగా ఉన్న శ్రేయస్ అయ్యర్ వద్దకు ప్రీతి జింటా వెళ్లి అతన్ని హత్తుకుని వీపుపై తట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో మరియు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అభిమానులు ప్రీతి జింటా యొక్క ఈ చర్యను ప్రశంసిస్తున్నారు. దీంతో ఆమెను "ఐపీఎల్‌లో అత్యుత్తమ యజమాని" అని కొందరు అభివర్ణిస్తున్నారు.












Click it and Unblock the Notifications